OTTలోకి వచ్చేస్తున్న రాజమౌళి కొడుకు సినిమా... స్ట్రీమింగ్ ఎక్కడంటే?

దర్శకధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లదు. ఆయన తండ్రి వద్దే ఉంటూ ప్రోడక్షన్ పనులు చూసుకుంటాడనే సంగతి తెలిసిందే. అయితే ఓటీటీలోకి మరి రాజమౌళి కొడుకు సినిమా ఏంటా అని కంగారు పడిపోతున్నారా.. ఆయన హీరోగా కాకపోయినా.. ఆయన తెలుగులో రిలీజ్ చేసిన మలయాళం సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అదేంటో ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. అసలు పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

జక్కన్న తీసింది కొన్ని సినిమాలే.. పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. మరి ఆయనకు వెన్నులా వెంటే ఉంటూ నడిపించే కొడుకు కార్తికేయ. తండ్రికి అండగా నిలుస్తూ.. సినిమాని అద్భతంగా తెరక్కించేందుకు ముందుంటాడు కార్తికేయ. ఇక ఆయన ఆరంగేట్రం కూడా జరగబోతుందని అప్పట్లో ప్రచారం అయితే సాగింది. ఇక ఆయన దర్శకుడిగా మారి సినిమాలు కూడా తెరక్కిస్తారనే వార్తలు వచ్చాయి. వీటిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు రాజమౌళి కొడుకు పేరు మారు మ్రోగిపోతుంది.

Rajamouli Son Karthikeya Premalu Telugu Version Streaming on Disney Plus Hotstar OTT From March 29th Full Details Here

దానికి కారణం మలయాళం సినిమా ప్రేమలు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టుగా నిలిచింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి.. సూపర్ హిట్టుగా నిలిచింది. ఏకంగా వందల కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇప్పుడు తెలుగులోనూ సంచలనం సృష్టిస్తుంది. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి యూత్ అంతా కనెక్ట్ అయిపోయారు. తెలుగులో సైతం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ చిత్రం.

ఇక ఇప్పటికే ఈ చిత్రంపై దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా రివ్యూ ఇచ్చారు. రాజమౌళి అయితే ప్రేమలు సినిమా హీరోయిన్ కు ఫిదా అయిపోయి ప్రశంసలు కూడా ఇచ్చాడు. గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కకిన ఈ చిత్రంలో స్లీన్‌, మ‌మితా బైజు హీరోహీరోయిన్లుగా న‌టించి మెప్పించారు. ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ మూవీ.. వందల కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. కేవలం 10 కోట్లతో తెరకెక్కి సంచలనం వసూళ్లు రాబడుతుంది..

Rajamouli Son Karthikeya Premalu Telugu Version Streaming on Disney Plus Hotstar OTT From March 29th Full Details Here

మలయాళ ప్రేక్షకుల మెప్పు పొందిన ప్రేమలు తెలుగులోకి ఆలస్యంగా వచ్చింది. మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇక్కడ సైతం తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. డైరెక్టర్ రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం థియేటర్లలో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం.. త్వరలో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ప్రేమలు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేమలు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 29 నుంచి ఈ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ లవ్ స్టోరీని ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్రేమ‌లు స్ట్రీమింగ్ కు రానుంది. మరో రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X