Vettaiyan OTT: ఓటీటీలోకి రజనీకాంత్ కాప్ డ్రామా.. వేట్టయాన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vettaiyan OTT Release: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయాన్ ది హంటర్. ఈ భారీ బడ్జెట్ మూవీ అక్టోబర్ 10 దసరా కానుకగా అడియన్స్ ముందుకు వచ్చింది. జైభీమ్ మూవీ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించారు. ఈ థ్రిల్లర్ కాప్ డ్రామాలో రజనీకాంత్ హీరోలో నటించగా.. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్, రోహిణి, రావు రమేష్, అభిరామి, రమేష్ తిలక్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా దీపావళీ కానుకగా వేట్టయాన్ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించారు.
వేట్టయన్ ది హంటర్ లో దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత రజనీతో అమితాబ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మల్లీ స్టార్గర్ గా తెరకెక్కిన ఈ మూవీని దాదాపు రూ. 160 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించగా.. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఇక ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. విడుదలకు ముందే వేట్టాయన్ మూవీకి నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేశాయి. దీంతో భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మంచి విజయాన్ని అందుకుంది.

ఫస్ట్ వేట్టయాన్ కథ విషయానికి వస్తే.. అథ్యాన్ (రజినీకాంత్) ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. అతనికి నిజాయితీతో పాటు ధైర్యం ఎక్కువ. న్యాయం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి కూడా వెనుకాడడు. ఈ తరుణంలో శరణ్య (దుషార విజయన్) అనే స్కూల్ టీచర్ హత్యతో షాక్ అవుతాడు. హత్య చేసిన నిందితులు తప్పించుకోవడంతో ప్రభుత్వం, పోలీసు అధికారులపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ తరుణంలో అథ్యాన్ రంగంలోకి దిగుతాడు. కేసు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని గంటల్లోనే హంతకుడిని చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మానవ హక్కుల కార్యకర్త న్యాయమూర్తి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) ఈ ఎన్‌కౌంటర్‌ను ఎందుకు తప్పుబడుతారు? అథియోన్‌కి మళ్లీ కేసు దర్యాప్తు చేయాలని ఎందుకు అనిపించింది? శరణ్య హత్య వెనుక ఎవరున్నారు? అథ్యాన్ , ప్యాట్రిక్ అలియాస్ బ్యాటరీ (ఫహద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి) మధ్య సంబంధం ఏమిటి? (వెట్టయన్) తదితర విషయాలు మీరు సినిమా చూడాల్సిందే.
వాస్తవానికి ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ సినిమా స్టోరీ నారేషన్ కాస్తా నెమ్మదిగా సాగిందని, బోరింగ్ ఫీలింగ్ వచ్చిందని కొందరు రివ్యూస్ టాక్. కానీ, రజినీతోపాటు మిగతా యాక్టర్స్ యాక్టింగ్, యాక్టన్ ఈ మూవీకి ఫ్లస్ పాయింట్ అని తెలిపారు. ప్రతి సీన్ గూస్ బంప్స్ అంటూ కామెంట్స్ చేశారు. టాక్ ఎలా ఉన్నా.. ఈ థిల్లర్ మూవీ థియోటర్లలో సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 250 కోట్ల కలెక్షన్లు రాబట్టిందట. మొత్తానికి రజనీ కాంత్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక వేట్టయాన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. రజినీకాంత్ మూవీ 'వేట్టైయన్' ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. దీపావళీ కానుకగా వేట్టయాన్ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. తాజాగా వేట్టయాన్ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. వేట్టయాన్ మూవీ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, తమిళం భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నది.


Click it and Unblock the Notifications











