Jailer HD ప్రింట్ లీక్ ఎఫెక్ట్... OTT లోకి ముందే రానున్న మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. ఇక ఈ మూవీ ఆగస్టు 10వ తేదీన థియేటర్లోకి వచ్చింది. అయితే రిలీజ్ అయి మూడు వారాలు అవుతున్నా... బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్లు మాత్రం ఆగడం లేదు. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాకముందే తమిళ జైలర్ హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అయింది. ఇక ఈ నేపథ్యంలో మేకర్స్ ఓటీటీ విడుదలను అనుకున్న తేదీ కంటే ముందే రిలిజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్... జైలర్ సినిమాతో మంచి ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను బీస్ట్ ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా... సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో రజినీ కాంత్ సరసన రమ్యకృష్ణ నటించగా.. హీరోయిన్ గా తమన్నా నటించింది. ఇక వీరితో పాటు.. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించారు.

జైలర్ సినిమా రిలీజై మూడు వారాలు అవుతున్నా.. ఇప్పటికీ మంచి కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్ లో లీకవడం ఆందోళన కలిగిస్తోంది. జైలర్ మూవీ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్ లో లీకైన విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దీనిపై అతడు షాక్ వ్యక్తం చేశాడు. అసలు ఎలాంటి వాటర్‌మార్క్స్ లేకుండా ఒరిజినల్ హెచ్‌డీ ప్రింట్ లీక్ కావడం షాక్ కు గురిచేసింది.

ఇది అటు థియేటర్ ఓనర్లను, ఇటు ఓటీటీని ఆందోళనకు గురి చేసిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.100 కోట్లు చెల్లించి కొనుక్కుంది. ఇప్పుడీ మూవీ లీకవడంతో ఎంతోకొంత ఓటీటీకి నష్టాలు తప్పవు. కేవలం ఇండియాలోనే ఇప్పటి వరకూ రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది రూ.600 కోట్లకుపైగానే కావడం విశేషం.
అయితే ఈ నేపథ్యంలోనే మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ నిజానికి ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. కానీ ఇప్పుడు హెచ్ డి ప్రింట్ లీకవ్వడం చేత... కాస్త ముందుగానే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అయినప్పటికీ థియేటర్స్ ఓనర్స్ కి కాస్త షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు.

ఇక జైలర్ సినిమాను సెప్టెంబర్ 7వ తేదీ నుంచే ఓటీటీలో రిలీజ్ చేయాలనీ డిసైడ్ చేసినట్టుగా కోలివుడ్ వర్గాల సమాచారం. ఇక దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది. మొత్తానికి అయితే థియేటర్స్ లో బాగానే రన్ అవుతున్నా... ఈ సినిమా ఇంత తొందరగా స్ట్రీమింగ్ అంటే స్వల్పంగా ఎఫెక్ట్ చూపించవచ్చు.


Click it and Unblock the Notifications











