Rajinikanth Jailer OTT Release: రజినీ 'జైలర్' ఓటీటీ పార్ట్‌నర్ ఎవరో తెలిసిపోయింది.. రిలీజ్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ జైలర్ థియేటర్లకు రానే వచ్చింది. ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. అయితే ఈ సినిమా ఓటీటీ డీల్ అండ్ ఓటీటీ పార్ట్నర్, రిలీజ్ డేట్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే...
సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ జైలర్ సినిమాతో ఫాంలోకి వచ్చేశారు. జైలర్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ యాక్టర్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతుంది. ప్రేక్షకులకు రెట్టింపు ఉత్సాహం తెప్పిస్తోంది. రజినీ స్టైల్, స్వాగ్ మరోసారి ఈ చిత్రంతో అదరగొట్టారని టాక్.

ఇక జైలర్ ఓటీటీ విషయానికి వస్తే... స్ట్రీమింగ్ హక్కుల కోసం.. అనేక ఓటీటీ వేదికలు పోటీ పడ్డాయి. చివరికి జైలర్ మూవీని సన్ ఎక్స్ టీవి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ విడుదల తేదీపై క్లారిటీ లేనప్పటికీ.. రిలీజ్ అయిన తర్వాత దాదాపు 45-60 రోజుల అనంతరం ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ వచ్చే అవకాశం ఉంది. అంటే సెప్టెంబరు చివరిలో లేదా అక్టోబర్ ప్రారంభంలో జైలర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇక జైలర్ సినిమా టాప్ టెలివిజన్ ఛానెల్ అయిన సన్ టీవీకి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. భారీ ధరకు జైలర్ సినిమాను సన్ పిక్చర్స్ భారీ ధరకు విక్రయించనట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా సన్ టీవీలో ప్రసారం చేయాలని భావిస్తున్నారట.

ఇక ఇప్పటికే జైలర్ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. థియేట్రికల్ హక్కులు భారీగా రేటు పలికాయని తెలుస్తోంది. తమిళనాడు థియేట్రికల్ హక్కులు 62 కోట్లుకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం, ఆంధ్రా హక్కులు 12 కోట్ల రూపాయలు, కన్నడ థియేట్రికల్ హక్కులు 10 కోట్ల రూపాయలు, కేరళ హక్కులు 6 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో బిజినెస్ 3 కోట్లు మేర విక్రయించినట్లు సమాచారం.
ఇక జైలర్ సినిమా ఓవర్సీస్ హక్కులు కూడా భారీ కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. యూఎస్, యూకే, మలేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, యూరప్ దేశాల్లో జైలర్ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 30 కోట్ల మేర అమ్ముడుపోయాయని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇక జైలర్ సినిమా రిలీజ్ తర్వాత లాభాల్లోకి రావాలంటే... సుమారుగా 125 కోట్ల షేర్, 240 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాకు మంచి టాక్ వస్తే.. ఈ కలెక్షన్లు తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో జరిగాయి. మొదటి రోజు.. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా టాక్ బాగుంటే... వారంలోనే జైలర్ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొవచ్చు.


Click it and Unblock the Notifications











