OTT: ఓటిటిలో స్ట్రీమింగ్ ఆగిన లాల్ సలామ్.. రజినీ సినిమా ఎప్పుడు ఎందులో అంటే?

ప్రస్తుతం థియేట్రికల్ సినిమా రిలీజ్ అవ్వాలో లేదో అసలు స్టార్ట్ అవ్వాలో లేదో అనే అంశాన్ని కూడా ఒక్క ఓటిటి రంగమే డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా నిలిచిపోయింది అని చెప్పాలి. దీనితో ఓటిటి ప్రభావం ఈ రేంజ్ లోకి మారిపోయింది. అలాగే సినిమాలు మొదట అనుకున్న తర్వాత ఓటిటి డీల్ పూర్తయ్యిన తర్వాతే రిలీజ్ కి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా ఇంకొన్ని చిత్రాలు అయితే థియేటర్స్ లో వచ్చినప్పటికీ తర్వాత ఓటిటి రిలీజ్ కి నోచుకోనివి కూడా ఉన్నాయి. అయితే ఈ ఏడాదిలో అలా రాకున్నా ఉన్న సినిమాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఉన్నాయి. కాగా వీటిలో తమిళ్ నుంచే రెండు సినిమాలు ఉండగా ఈ చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ గా సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన చిత్రం కూడా ఉంది.

rajinikanth lal salaam finally getting into ott and will stream in this platform

ఆ చిత్రమే తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో చేసిన సినిమా "లాల్ సలామ్". అయితే ఈ చిత్రంలో రజినీకాంత్ మొదట క్యామియోలో కనిపిస్తారు అన్నారు. తర్వాత రోల్ అన్నారు. కానీ చివరికి చివరికి ఫుల్ లెంగ్త్ లోనే తీశారు. అయినప్పటికీ దీనికి ముందు "జైలర్" లాంటి భారీ హిట్ రజినీకాంత్ ఖాతాలో ఉన్నప్పటికీ ఈ లాల్ సలామ్ సినిమా దారుణమైన నష్టాలు ఇచ్చి ఘోరమైన డిజాస్టర్ గా నిలిచిపోయింది.

ఇంతేనా ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ఒక కాంట్రవర్సీ అయితే అయ్యాక మరో ట్విస్ట్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద ప్లాప్ అవ్వడానికి కారణాలు ఏంటి అనే క్రమంలో ఐశ్వర్య రజినీకాంత్ సినిమా షూట్ చేసిన ఫుటేజ్ మిస్ అయ్యింది అని ఆ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ కనిపించకపోయిన కారణంగానే లాల్ సలామ్ ప్లాప్ అయ్యింది అని అలాగే ఓటిటి రిలీజ్ కూడా కావడం లేదని తెలిపింది.

rajinikanth lal salaam finally getting into ott and will stream in this platform

కానీ మధ్యలో అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటూ పలు ఊహాగానాలు వినిపించాయి. అలాగే నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ అంటూ రెండు ఓటిటి యాప్స్ పేర్లు కూడా బాగా వినిపించాయి. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి ఎంట్రీపై కొంచెం క్లారిటీ తెలుస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ ని మేకర్స్ కనుగొన్నారట. దీనితో ఆది ఓటిటి వెర్షన్ కి యాడ్ చేసి అతి త్వరలోనే విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే దీనికి ఎలా లేదన్నా నెల లేదా రెండు నెలలు పట్టే ఛాన్స్ కూడా ఉంది. అన్నట్టు ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లోనే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో సన్ నెక్స్ట్ లో అన్న వార్తలు అవాస్తవమే అని చెప్పాలి. మరి ఎప్పుడు నుంచో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరి మిస్ అయ్యిన ఫుటేజ్ తో ఓటిటిలో అయినా మంచి రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Read more about: rajinikanth lal salaam coolie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X