రజినీకాంత్ 'కూలి'.. 120 కోట్లకు ఓటీటీ ఆఫర్.. ఏ ప్లాట్ ఫామ్ అంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ చివరిగా 'జైలర్' చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి ఏకంగా రూ.210 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకొని ఇండియాలోనే అత్యధికంగా పారితోషికం తీసుకునే హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. ఏడు పదుల వయస్సులోనూ యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను ఖుషి చేస్తున్నారు. ఈ క్రమంలో రజినీకాంత్ నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదికూడా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తుండటం మంచి హైప్ ను క్రియేట్ చేసింది. 'కూలి' టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతున్నాయి.
రజినీకాంత్ 171వ చిత్రంగా 'కూలి' రూపుదిద్దుకుంటోంది. 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన చిత్రమిది. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ గ్రాండ్ స్కేల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండటంతో సినిమాపై అంతకంతకు అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. కాగా ఈచిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అని రజినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైతే ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేయలేదు.

కాగా, 'కూలి' చిత్రం ఓటీటీ రైట్స్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు భారీ ధరకే దక్కించుకున్నారని తెలుస్తోంది. కాగా తాజాగా మరో ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ 'కూలి' చిత్రానికి రూ.120 కోట్ల భారీ ఆఫర్ ను అందించిందంట. మరీ ఇంక థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్న ఈచిత్రం ఓటీటీ విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. కేవలం ఓటీటీకే రూ.120 కోట్ల అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం ఆ బడ్జెట్ లో ఓ భారీ చిత్రాన్నే నిర్మించవచ్చని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఇక 'కూలి' చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రజినీకాంత్ తన వరకు షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక వెంటనే దర్శకుడు నెల్సన్ డైరెక్షన్ లో 'జైలర్ 2'లో నటించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. ఇకపోతే 'కూలి' చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. 2025 మేలో లేదంటే జూన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తుండటంతో దేశ వ్యాప్తంగా అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. టాలీవుడ్ నుంచి కింగ్, అక్కినేని నాగార్జున, కన్నడ నుంచి రియల్ స్టార్ ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. రెబా మోనికా జైన్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్, సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో అప్పీయరెన్స్ ఇస్తుండగా.. బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్దే స్పెషల్ డ్యాన్స్ తో అదరగొట్టబోతున్నది. అనిరుధ్ మరోసారి తన సెన్సేషనల్ మ్యూజిక్ తో ఇండియాను ఊపేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











