కూలి ఓటీటీ రైట్స్ కు భారీ ధర.. ఎన్ని 100ల కోట్లకు అమ్ముడైందో తెలుసా?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు మార్కెట్ లో ఎలాంటి డిమాండ్ ఉంటుందో తెలిసిందే. ఇప్పటికే రజనీకాంత్ 'జైలర్' చిత్రంతో దుమ్ములేపారు. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్లతో అదరగొట్టారు. దీంతో రజనీకాంత్ నుంచి తరువాత రాబోయే చిత్రాలకు మరింతగా క్రేజ్ పెరిగింది. ఇక నెక్ట్స్ రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో కూలి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వివరాలు అందాయి. కూలి ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోవడం విశేషం. ఎన్ని కోట్లకు, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు అనే వివరాల్లోకి వెళితే..
కూలితో రజనీకాంత్ రికార్డు..
రజనీకాంత్ కూలి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం రజనీకి ఉన్న స్టార్ వాల్యూ. మరోవైపు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం కావడం విశేషం. అలాగే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు నెలకున్నాయి. దాంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే కూలి మూవీ ఓవర్సీస్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ.68 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం. దీంతో ఇప్పటి వరకు కోలీవుడ్ లో హయ్యేస్ట్ ధరకు ఈ సినిమానే ఓవర్సీస్ రైట్స్ ను అమ్మడం రికార్డును క్రియేట్ చేసింది.

భారీ ధరకు డిజిటల్ రైట్స్..
కూలి చిత్రం రిలీజ్ కు ఇంకా రెండు నెలల సమయం ఉంది. రజనీకాంత్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశారు. మిగితా షూటింగ్ ను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ రఫ్ కట్ అవుట్ పై మంచి టాక్ వినిపిస్తోంది. దీంతో చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో కూలి చిత్రం ఓటీటీ రైట్స్ ను రూ.110 కోట్లకు కొనుక్కోవడం విశేషం. ఇక సన్ టీవీ నెట్ వర్క్స్ శాటిలైట్ రైట్స్ ను తమ వద్దనే ఉంచుకున్నాయి.
భారీ బడ్జెట్ కూలి..
ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ మరింత ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. యాక్షణ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో సినిమాకు రూ.350 కోట్లు ఖర్చైందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. అందుకే సన్ గ్రూప్ కు చెందిన సన్ టీవీ నెట్ వర్క్స్ కే శాటిలైట్ రైట్స్ కేటాయించడం గమనార్హం.
భారీ తారాగణం.. టెక్నీషియన్లు..
రజనీకాంత్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ లో నటించడం ఆసక్తికరమైన అంశం. మరోవైపు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ క్యామియో అప్పీయరెన్స్ ఇస్తుండటం విశేషం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











