Jailer OTT: జైలర్ ఓటీటీ డేట్ వచ్చేసింది.. 600 కోట్ల సినిమా నెల రోజులకే!

పేరుకు సౌత్ ఇండియాకు చెందిన హీరోనే అయినా.. ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకుని.. సుదీర్ఘ కాలంగా బడా హీరోగా హవాను చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో ఇప్పటికీ అదే స్పీడుతో సినిమాలు చేస్తోన్న ఆయన.. దాదాపు ఐదేళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా ఖాతాలో వేసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో 'జైలర్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నటించారు. ఇది ఆగస్టు 10న గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన మూవీనే 'జైలర్'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అదే అన్ని భాషల్లోనూ కంటిన్యూ అయింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తాయి.

Rajinikanth Starrer Jailer Movie Streaming on Amazon Prime From September 7th

రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీకి ఇప్పుడు కూడా కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లు వరకూ గ్రాస్‌, రూ. 290 కోట్లు షేర్ రాబట్టింది. తద్వారా రూ. 160 కోట్లకు పైగా లాభాలను కూడా సొంతం చేసుకుంది. ఇక, తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వెలువడింది.

'జైలర్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు కొనుగోలు చేసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆగస్టు 10న విడుదలైన 'జైలర్' సెప్టెంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ తాజాగా ప్రకటించింది.

Rajinikanth Starrer Jailer Movie Streaming on Amazon Prime From September 7th

క్రేజీ కాంబోలో రూపొందిన 'జైలర్' సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి ప్రధాన పాత్రలను చేయగా.. తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X