Jailer OTT: ఓటీటీలోకి వచ్చేసిన జైలర్.. తమన్నావి ఆ సీన్స్ కూడా కలిపారా!

దాదాపు నాలుగున్నద దశాబ్దాలుగా సినీ రంగంలో తనదైన రీతిలో హవాను చూపిస్తూ.. సూపర్ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నారు తలైవా రజినీకాంత్. విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలను చేస్తోన్న ఆయన.. చాలా కాలంగా హిట్లను మాత్రం ఖాతాలో వేసుకోలేకపోతోన్నారు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇటీవలే 'జైలర్'తో వచ్చారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సినిమానే 'జైలర్'. భారీ అంచాలనతో వచ్చిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అదే అన్ని భాషల్లోనూ కంటిన్యూ అయింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో వచ్చింది. ఫలితంగా ఇది రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది.

Rajinikanth Starrer Jailer Movie Streaming Started on Amazon Prime

తలైవా రజినీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' మూవీకి ఇప్పుడు కూడా కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 605 కోట్లు వరకూ గ్రాస్‌, రూ. 295 కోట్లు షేర్ రాబట్టింది. తద్వారా రూ. 171 కోట్లకు పైగా లాభాలను కూడా సొంతం చేసుకుంది. దీంతో పాటు ఎన్నో రికార్డులను కూడా ఈ యాక్షన్ మూవీ క్రియేట్ చేసిందని తెలిసిందే.

'జైలర్' మూవీపై ఆరంభం నుంచీ అంచనాలు ఉండడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు కొనుగోలు చేసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు డీల్ చేసుకున్నారు.

Rajinikanth Starrer Jailer Movie Streaming Started on Amazon Prime

ముందుకు చేసుకున్న ఒప్పందం ప్రకారమే సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తాజాగా స్ట్రీమింగ్‌కు తెచ్చేసింది. నేటి అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఎడిటింగ్‌గా కట్ అయిన తమన్నాకు సంబంధించిన కొన్ని సీన్స్‌ను యాడ్ చేసినట్లు తెలిసింది. ఇక, ఓటీటీలో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది.

Rajinikanth Starrer Jailer Movie Streaming Started on Amazon Prime

యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'జైలర్' సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి ప్రధాన పాత్రలను చేయగా.. తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X