Tiger Ka Hukum ఓటీటీలో జైలర్ అరుదైన రికార్డు.. 10 దేశాల్లో ట్రెండింగ్‌గా.. రికార్డు వ్యూస్‌తో!

సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొన్న జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించినట్టే ఓటీటీలో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

జైలర్ చిత్రం ట్రేడ్ అంచనాలు తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మాయ ఏమిటో చూపించింది. సౌత్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా సినిమా వసూళ్లను మించి కలెక్షన్లను రాబట్టింది. దాంతో రజనీకాంత్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది.

Jailer

ఇక సన్ పిక్చర్స్ బ్యానర్‌ ఇప్పటి వరకు నిర్మించిన సినిమాల్లో కంటే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. కళానిధి మారన్‌ కూడా ఊహించని విధంగా వసూళ్లు రావడంతో తన ఆనందాన్ని అవధులు లేకుండా పోయాయి. దాంతో రజనీ, నెల్సన్, అనిరుధ్‌కు ఖరీదైన కార్లను బహుకరించారు. చిత్ర యూనిట్ సభ్యులకు బంగారు నాణేలు ప్రజెంట్ చేశారు.

ఇలాంటి విజయం సాధించిన జైలర్ చిత్రం తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. థియేట్రికల్ రిలీజ్‌కు సమానంగా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్నది. గతవారం రోజుల్లోనే పలు దేశాల్లో నెంబర్ వన్ చిత్రంగా ట్రెండింగ్ అవుతున్నది.

అమెజాన్‌ ప్రైమ్‌లో జైలర్ చిత్రం ఇండియాలో టాప్ 10 స్థానంలో ట్రెండ్ అవుతున్నది. ఇంకా యూఏఈ, యూకే, సింగపూరు్, బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, కెనడా, తదితర దేశాల్లో టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది. జైలర్‌కు బాక్సాఫీస్ వద్దనే కాకుండా ఓటీటీలో కూడా హుకుం అంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X