Jailer On OTT రజనీకాంత్ మూవీ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు? ఎక్కడంటే?

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నది. ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తున్నది. ఈ చిత్రం గత 6 రోజుల్లోనే 400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ జోరు కొనసాగుతున్న సమయంలో ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్, ఓటీటీ రిలీజ్ డేట్ గురించి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జైలర్ ఓటీటీ వివరాల్లోకి వెళితే..

జైలర్ సినిమా రిలీజ్‌కు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను రికార్డు స్థాయిలో పూర్తి చేసుకొన్నది. శాటిలైట్, ఓటీటీ హక్కులకు ఫ్యాన్సీ రేటుతో బిజినెస్‌ను సన్ పిక్చర్స్ పూర్తి చేసుకొన్నది. అయితే బిజినెస్ మాత్రం రజనీకాంత్ కెరీర్‌లో అత్యుత్తమంగా రేటు పలికిందని చెప్పుకొంటున్నారు.

Rajinikanths Jailer movie OTT steaming and date details

జైలర్ సినిమాను సన్ పిక్చర్స్ స్వయంగా నిర్మించడంతో శాటిలైట్ హక్కులను సన్ టెలివిజన్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమాను తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో సన్ నెక్ట్స్ ఫ్లాట్‌ఫామ్ ప్రసారం చేయనున్నది. సన్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందే సినిమాలు వేరే శాటిలైట్ ఛానెల్స్‌లో ప్రసార హక్కులు ఇవ్వడం దాదాపు జరుగని పని అనే విషయం తెలిసిందే.

ఇక జైలర్ ఓటీటీ హక్కులను భారీ రేటుకు వెలకట్టారనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి సన్ నెక్ట్స్ ఓటీటీ భాగస్వామ్యం కానున్నది. దాంతో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌తోపాటు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానున్నది. ఈ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ రేటును చెల్లించినట్టు సమాచారం.

Rajinikanths Jailer movie OTT steaming and date details

జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ విషయానికి వస్తే.. తాజా ఒప్పందం ప్రకారం సినిమా రిలీజ్ తేదీ నుంచి తక్కువలో తక్కువ 28 రోజులపాటు ఓటీటీలో రిలీజ్ చేయకూడదు. అలాంటి ఒప్పందం ప్రకారం.. జైలర్ సినిమా సెప్టెంబర్ 6వ తేదీ గానీ, లేదా సెప్టెంబర్ 7వ తేదీ గానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా థియేట్రికల్‌గా రన్ కొనసాగితే. ఈ స్ట్రీమింగ్ డేట్ మారే అవకాశాలు లేకపోలేదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Rajinikanths Jailer movie OTT steaming and date details

సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో 169వ చిత్రంగా రూపుదిద్దుకొన్న జైలర్ చిత్రం రానున్న రోజుల్లో 600 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫి, ఆర్ నిర్మల్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, తమన్నా భాటియా, వినాయకన్, వసంత్ రవి, మిర్నా మీనన్, యోగిబాబు తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X