Rakasa OTT: నెట్‌ఫ్లిక్స్‌లో రాకాస జోరు.. గ్లోబల్ రేంజ్‌లో నిహారిక కొణిదెల మూవీ హవా!

యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో వరుస విజయాలు అందుకుంటున్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఇటీవల ఆమె నిర్మాణంలో వచ్చిన మూవీ రాకాస. హార్రర్ కామెడీ, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంతో పాటు నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు తర్వాత మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నిహారిక. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఇటీవల ఓటీటీలోకి వచ్చిన రాకాస మూవీ .. డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ దుమ్మురేపుతోంది.

Also Read
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్

రాకాస మూవీలో సంతోష్ శోభన్, నయన్ సారిక జంటగా నటించగా.. మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 3న రాకాస వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Rakasa Dominates Netflix Global Charts With 1 2 Million Views

రాకాస బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ఈ సినిమా థియేట్రికల్‌గాను మంచి బిజినెస్ చేసింది. ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడైంది. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రాకాస బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ రాబట్టాలని ట్రేడ్ పండితులు నిర్దేశించారు. రాకాస మూవీని ఆంధ్రా, తెలంగాణలలో 1000 స్క్రీన్లలో, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 250 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 350 స్క్రీన్లలో విడుదల చేశారు.

Recommended For You
'ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’
'ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’

రాకాస కలెక్షన్స్
రాకాస మూవీకి తొలివారం 11.45 కోట్ల రూపాయలు, రెండో వారం 2.46 కోట్ల రూపాయలు, మూడో వారం 76 లక్షల రూపాయలు, 22వ రోజున 9 లక్షల రూపాయలు, 23వ రోజున 2 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో 14.78 కోట్ల రూపాయల గ్రాస్.. 16.79 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున రాబట్టింది. ఓవర్సీస్‌లో దాదాపు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తద్వారా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 21 కోట్ల రూపాయల మేర రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసేసరికి 27 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ఫిలింనగర్ వర్గాల టాక్.

You May Also Like
కళ్యాణ్ పడాలపై షాకింగ్ రూమర్స్... దిమ్మతిరిగేలా బిగ్‌బాస్ విన్నర్ తల్లి కౌంటర్
కళ్యాణ్ పడాలపై షాకింగ్ రూమర్స్... దిమ్మతిరిగేలా బిగ్‌బాస్ విన్నర్ తల్లి కౌంటర్

ఓటీటీలో రాకాస హవా
రాకాస డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. థియేటర్‌లో రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధన మేరకు నిర్మాతలతో ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా థియేట్రికల్ రన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన రాకాస మూవీ .. మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. వేసవి సెలవులకు తోడు.. సాధారణంగా హార్రర్ కామెడీ జోనర్స్‌కు డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఉండే క్రేజ్‌తో రాకాస దూసుకెళ్తోంది. దాంతో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఓపెనింగ్ వీక్‌లోనే టాప్‌లో కొనసాగుతోంది. ఇక గ్లోబల్ రేంజ్‌లోనూ రాకాస దుమ్మురేపుతోంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఉన్న లెక్కల ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌ నాన్ ఇంగ్లీష్ మూవీస్‌ కేటగిరీలో 12 లక్షల వ్యూస్‌తో 7వ స్థానంలో నిలిచింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సినిమాలను దాటుకుని రాకాస ఈ ఫీట్ సాధించింది. మరి రాబోయే రోజుల్లో రాకాస ఇంకెన్ని రికార్డులు స‌ృష్టిస్తుందో చూడాలి.

Read more about: Rakasa netflix niharika konidela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X