Rakasa on OTT: ఓటీటీలోకి రాకాస.. సంగీత్ శోభన్ హార్రర్ కామెడీ మూవీని ఎక్కడ చూడాలంటే?

సంతోష్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో వచ్చిన మూవీ రాకాస. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 3న రాకాస వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న రాకాస ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సంగీత్ శోభన్ హార్రర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

రాకాస బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడయ్యాయి. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిహారిక కొణిదెల మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ను బ్రేక్ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. రాకాస మూవీని ఆంధ్రా, తెలంగాణలలో 1000 స్క్రీన్లలో, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 250 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 350 స్క్రీన్లలో విడుదల చేశారు.

Rakasa OTT Release Niharika Konidela s Movie set to streaming on Netflix from May 1st

రాకాస కలెక్షన్స్
రాకాస మూవీకి తొలివారం 11.45 కోట్ల రూపాయలు, రెండో వారం 2.46 కోట్ల రూపాయలు, మూడో వారం 76 లక్షల రూపాయలు, 22వ రోజున 9 లక్షల రూపాయలు, 23వ రోజున 2 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో 14.78 కోట్ల రూపాయల గ్రాస్.. 16.79 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో దాదాపు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రాకాస మూవీకి వరల్డ్ వైడ్‌గా 21 కోట్ల రూపాయల మేర రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసేసరికి 27 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా కొందరు అనలిస్టులు చెబుతున్నారు.

అయితే రిలీజ్‌కు ముందే రాకాస మూవీ టేబుల్ ప్రాఫిట్స్ అందుకుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. ఇక మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కింద మరో 4 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ 14 కోట్లు రూపాయలు, థియేట్రికల్ బిజినెస్ 12.5 కోట్లు చొప్పున మొత్తంగా 26 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే బట్జెట్ 15 కోట్లు పోను.. నిర్మాతకు 11 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఇక థియేట్రికల్ రన్‌లోనూ ఈ సినిమా మెరుగైన ఫలితాలు రాబట్టి సక్సెస్‌ఫుల్ వెంచర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

రాకాస ఏ ఓటీటీలో అంటే?
థియేటర్‌లో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత రాకాస మూవీ ఓటీటీలోకి విడుదల అవ్వాలనే నిబంధన మేరకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ డీల్ కుదుర్చుకుంది. అయితే ఈ సినిమా మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అందుబాటులోకి వస్తుందని ఓటీటీ సంస్థ ప్రకటించింది. మరి ఓటీటీలో ఈ హార్రర్ కామెడీ మూవీ ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి.

Read more about: Rakasa niharika konidela netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X