Rakasa OTT Release: రాకాస ఓటీటీ రిలీజ్.. సంగీత్ శోభన్ హార్రర్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం రాకాస. లవ్, యాక్షన్, కామెడీ, ఫాంటసీ మేళవింపుగా ఈ సినిమాను తెరకెక్కించారు. యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించగా.. మానస శర్మ దర్శకత్వం వహించారు. నిర్మాత, డైరెక్టర్ ఇద్దరూ మహిళలు కావడం ఈ సినిమా విశేషం. గుడ్ ఫ్రైడ్ కానుకగా ఏప్రిల్ 3న రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ కానుంది? ఓటీడీ డీల్ ఎంత? స్ట్రీమింగ్ ఎప్పుడు? అనే వివరాలు పరిశీలిస్తే..

రాకాస తారాగణం
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా రాకాసను నిర్మించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.

Rakasa OTT Release When And Where To Watch Sangeeth Shobhan s Movie Online After Theatrical Run

రాకాస బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం చేసిన వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, 3డీ ఎఫెక్ట్స్ కోసం నిహారిక పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా రాకాసను ఆమె నిర్మించారు. దీనికి తోడు విస్తృతంగా చేపట్టిన ప్రమోషనల్ కార్యక్రమాలకు కూడా బాగానే డబ్బు ఖర్చయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

రాకాస ప్రీ రిలీజ్ బిజినెస్
టీజర్, ట్రైలర్‌తో పాటు నిహారిక కొణిదెల అండ్ టీమ్ నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీమియర్స్‌కు ముందు వరకు రాకాస టీమ్ ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తూ హైప్‌ని ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తపడింది. దీనికి తగినట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాకాస మూవీ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

రాకాస బ్రేక్ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడయ్యాయి. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిహారిక కొణిదెల మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే చేసినట్లుగా అనలిస్టులు చెబుతున్నారు. రాకాస డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 10 కోట్ల రూపాయల ఫ్యాన్సీ ధరను వెచ్చించి దక్కించుకుంది. అలాగే మ్యూజిక్, శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా బాగానే గిట్టుబాటు అయినట్లుగా తెలుస్తోంది. దాంతో రిలీజ్‌కు ముందే నిహారిక కొణిదెల ఈ సినిమాపై టేబుల్ ప్రాఫిట్ అందుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్.

రాకాస ఓటీటీ రిలీజ్ ఎప్పుడు
థియేటర్‌లో రిలీజైన 4-8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధన మేరకు నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం రాకాస మూవీ ఏప్రిల్ చివరి వారంలో లేదా మే రెండో వారంలో ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి రాకాస ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం కావొచ్చు లేదా ముందుగానే విడుదల కావొచ్చు. దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X