OTT: సడెన్‌గా ఓటీటీలోకి గుండెల్ని పిండేసే ప్రేమకథా చిత్రం ... ఎందులో చూడాలంటే?
ఓటీటీలోకి మరో గుండెల్ని పిండేసే ప్రేమకథా చిత్రం వచ్చేసింది. ప్రేక్షకుల హృదయాలను మెలిపెట్టే మరో లవ్ ఎమోషనల్ డ్రామా ఓటీటీలో సందడి చేస్తుంది. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్లుగా నటించిన సప్తసాగారాలు దాటి సైడ్ ఏ ఎంత హిట్ అయిందో తెలుసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సప్తసాగారాలు దాటి సైడ్ బీ చిత్రం కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి.. కుర్రకారును ఏడిపించేస్తుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
లవ్ ఎమోషనల్ సినిమాకు సీక్వెల్....
ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు సీక్వెల్ వస్తున్నాయి. యాక్షన్, ఫాంటసీ, సైన్స్ జోనర్, కామెడీ చిత్రాలకు సీక్వెల్ రావడం సహజం. కానీ ఓ లవ్ అండ్ ఎమోషనల్ మూవీకి సీక్వెల్ రావడం.. కొంచెం కొత్త. ఇక లవ్ అండ్ ఎమోషనల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో సప్త సాగరాలు దాటి సైడ్ ఏ చిత్రంగా రిలీజ్ చేశారు. ఇక తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.

ఇక సప్త సాగరదాచే ఎల్లో చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించి తెరకెక్కించారు. సప్తసాగార దాచే సైడ్ బీ పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో సప్త సాగారాలు దాటి సైడ్ బి పేరుతో రిలీజ్ అయింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. ఇక పార్ట్ 1 కంటే.. పార్ట్ 2 సాగదీతగా అనిపించింది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇక వసూళ్ల పరంగా అనుకున్న స్థాయిలో రాబట్టలేదు.
పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఓకే ఓటీటీలో....
ఇక ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా కోసం ప్రేక్షకులు ఎంతో కాలం నుంచి ఎదురు చూశారు. ఇక ఇటీవల రక్షిత్ శెట్టి తన సోషల్ మీడియా వేదికగా సప్తసాగారాలు దాటి సైడ్ బి మీ ఇంటికి వచ్చేస్తుందని హింట్ ఇచ్చాడు. ఇంతలో సడెన్ గా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మొదటి పార్ట్ ను కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ వీడియో.. ఇప్పుడు పార్ట్ 2 ను కూడా అదే సంస్థ కొనుగోలు చేసింది.
సప్త సాగరాలు దాటి సైడ్- బీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రచారం లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. గతేడాది నవంబరు 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా... ఓటీటీలోకి ఎప్పుడో రావాల్సింది. కానీ వాయిదా పడుతూ ఉండగా.. ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తుంది.

తెలుగువారికి రుక్మిణీ కనెక్ట్...
రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ఈ లవ్ స్టోరీ.. ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తోంది. ప్రియ పాత్రలో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకులనూ రుక్మిణీ వసంత్ ఆకట్టుకుంది. ఇక ఈ భామకు తెలుగులో కూడా అవకాశాలు లభిస్తున్నాయి. రవితేజ సినిమాలో ఈ భామ ఆఫర్ కొట్టేసింది. రవితేజ హీరోగా 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో రుక్మిణి హీరోయిన్ గా ఎంపిక అయిందట.


Click it and Unblock the Notifications











