OTT: నెలకాక ముందే ఓటీటీలోకి గుండెల్ని పిండేసే లవ్ డ్రామా.. ఎందులో చూడాలంటే?

ఓటీటీలోకి మరో కొత్త లవ్ ఎమోషనల్ డ్రామా రాబోతుంది. ఇప్పటికే సప్త సాగారాలు దాటి సైడ్ ఏ సినిమాతో ఫీల్ గుడ్ ఎంటర్ టైన్ ఇచ్చిన రక్షిత్ శెట్టి ఇప్పుడు మరోసారి సప్త సాగారాలు దాటి సైడ్ బితో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. కన్నడ మూవీ ఆఫ్ ది ఇయర్ గా పేరు తెచ్చుకున్న సప్త సాగారాలు దాటి సైడ్ బీ చిత్రం ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇటీవల థియేటర్లలో విడుదలై కన్నడ, తెలుగు నాట మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న చిత్రం సప్తసాగరాలు దాటి సైడ్ బీ. ఈ సినిమా సప్త సాగారాలు దాటి సైడ్ ఏ చిత్రానికి సీక్వెల్. రక్షిత్ శెట్టి హీరోగా, రుక్మిణి హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇక సప్త సాగారాలు దాటి సైడ్ బి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎమోషనల్, లవ్, డ్రామా జానర్ లో తెరకెక్కింది.

Rakshit Shetty Sapta Sagaralu Dhaati Side B Streaming on Amazon Prime Video OTT From Dec 15th, 2023 Full Details Here

ఔట్ అండ్ ఔట్ ఫుల్ ఎమోషనల్ తెరకెక్కిన సప్తసాగారాలు దాటి సైడ్ బి చిత్రానికి హేమంత్ ఎం.రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌న్న‌డంలో మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టిన ఈ మూవీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మొదటి పార్ట్ తో పోలిస్తే.. రెండో పార్ట్ కాస్త స్లో గా రన్ అవ్వడంతో ఆడియెన్స్ కు చేరువ కాలేకపోయింది. అయితే ఈ సినిమాలోని క్యారెక్టర్స్ , ఫీల్ చాలాకాలం గుర్తుండిపోయేలా ఈ చిత్రం తెరకెక్కిందనే చెప్పాలి.

మొదటి బాగం సైడ్ ఏలో హీరో ఓ బడా కంపెనీలో కారు డ్రైవర్ గా పని చేస్తూ.. పాటలు పాడే తన ప్రేయసితో సంతోషంగా ఉండేవారు. ఇక తన ప్రేయసితో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటాడు. ఈ క్రమంలో ఓనర్ చేసిన యాక్షిడెంట్ ను తనపై వేసుకుని జైలుకు వెళ్తాడు హీరో. తీరా లోపలికి వెళ్లాక బెయిల్ పై బయటకు తీసుకువస్తానన్న యజమాని గుండెపోటుతో చనిపోతాడు. హీరో జైలులోనే ఉండాల్సి రావడం... మధ్యలో పొయెటిక్ మాటలు, పాటలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

Rakshit Shetty Sapta Sagaralu Dhaati Side B Streaming on Amazon Prime Video OTT From Dec 15th, 2023 Full Details Here

ఇక మొదటి పార్టును ఆధ్యంతం ఆసక్తిగా తెరకెక్కించి ముగించారు. ఇక రెండో భాగం సైడ్ బీలో హీరో బయటకు రావడం... మరొకరిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ గురించి ఆలోచిస్తూ తీవ్ర మానసిక సంగర్షణ పడడం కాస్త స్లోగా అనిపిస్తుంది. ఆమె సంతోషంగా ఉందా లేదా అంటూ అనుక్షణం అమెనే గమనించడం వంటి ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూసే ప్రేక్షకుల గుండెనత్తుకునేలా సాగుతుంది.

ఇప్పటికే మొదటి పార్ట్ సైడ్ ఏ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుండగా... ఇప్పుడు సప్త సాగరాలు సైడ్ బీ కూడా అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 15న స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను హీరో రక్షిత్ శెట్టినే నిర్మాతగా వ్యవహరించారు. మీరు ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే గనుక ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X