OTT: వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ ఫీల్ గుడ్ మూవీ... ఎక్కడ చూడాలంటే?
కన్నడ హీరో రక్షిత్ శెట్టి తాజాగా నటించిన చిత్రం సప్త సాగరదాచే ఎల్లో (సైడ్ ఏ). ఇక ఈ మూవీ కన్నడంలో సూపర్ హిట్టుగా నిలిచింది. అయితే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో డబ్బింగ్ చేశారు. ఇక తెలుగులో రిలీజ్ అయన వారం రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి సడెన్ గా వచ్చేసింది. ఈ ఫీల్ గుడ్ మూవీకి థియేటర్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు గనుక ఈ మూవీని మిస్ అయితే... కచ్చితంగా ఓటీటీలో చూడాల్సిందే. అయితే ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. దీని కథేంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కన్నడ హీరో రక్షిత్ శెట్టి తెలుగు వారికి కూడా సుపరిచితమే. అతడే శ్రీమన్నారాయణ అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో... ఆ తర్వాత 777 చార్లీ సినిమాతో మరింత తెలుగు వారికి చేరువ అయ్యారు. ఇక రక్షిత్ శెట్టి అంటే చాలా మందికి రష్మిక మాజీ ప్రియుడు అని తెలుసు. ఆమెతో ప్రేమలో పడిన రక్షిత్... నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక ఏమైందో తెలియదు కానీ... వీరి ప్రేమకు బ్రేకులు పడి... పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక ఎవరి దారిన వాళ్లు సినిమాలు చేస్తూ బిజి బిజిగా గడుపుతున్నారు.

ఇక ఇటీవల రక్షిత్ శెట్టి.. రష్మిక గురించి మాట్లాడుతూ... మేము విడిపోయినా... మంచి ఫ్రెండ్సుగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికీ చాటింగ్ చేసుకుంటామని వెల్లడించారు. ఈ కామెంట్స్ ఆ మధ్య వైరల్ గా మారాయి. ఇక ఆ సంగతి పక్కన పెడితే.. ఇటీవల ఆయన నటించిన చిత్రం సప్త సాగరదాచే ఎల్లో. ఇక ఈ చిత్రం కన్నడంలో సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ అయింది. అక్కడ మంచి ఫీల్ గుడ్ మూవీగా మంచి టాక్ సొంతం చేసుకుని వసూళ్లు రాబట్టింది.

ఇక సప్త సాగరదాచే ఎల్లో చిత్రాన్ని తెలుగులో సప్త సాగారాలు దాటి అనే పేరుతో డబ్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకులు దీనిని ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఇందులోని సంగీతం కూడా అందరికి కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో రిలీజ్ చేసింది.

రక్షిత్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ నటించగా... వీరి జోడి అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం అనగా.. సెప్టెంబర్ 29వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఇక్కడి థియేటర్లలో రిలీజైన వారం రోజుల్లోనే సప్తసాగరాలు దాటి మూవీ ఓటీటీలోకి రావడం విశేషం. ప్రస్తుతం కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఇక సప్త సాగారాలు దాటి సినిమా కథ విషయానికి వస్తే... ఇదోక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఈ సినిమాకు హేమంత్ రావు దర్శకత్వం వహించారు. రక్షిత్, రుక్మిణీలతో పాటు అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్, పవిత్ర లోకేష్, రమేష్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. చరణ్ రాజ్ సంగీతం ఆకట్టుకుంది. ఈ సినిమాను మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కించారు. రెండో భాగం అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ ఫీల్ గుడ్ మూవీని ఓటీటీలో మాత్ర తప్పని సరిగా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











