47 కోట్లకి పైగా నెట్ ఫ్లిక్స్ మోసం.. రకుల్ మావయ్య మరో ట్విస్ట్.. నెట్ ఫ్లిక్స్ ఏమంటుందంటే

ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థల జాబితాలో అత్యధికంగా వినియోగదారులు వాడే స్ట్రీమింగ్ సంస్థ మాత్రం డెఫినెట్ గా నెట్ ఫ్లిక్స్ అనే చెప్పొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంటివి కూడా ఉన్నాయి కానీ అత్యధికంగా జనం మాత్రం నెట్ ఫ్లిక్స్ నే వాడేందుకు ఇష్టపడతారు.

కాగా నెట్ ఫ్లిక్స్ కి మన దేశంలో కూడా వినియోగదారులు ఎక్కువే అందుకే ఏ భారీ సినిమా అయినా కూడా ప్రస్తుతం దాదాపు నెట్ ఫ్లిక్స్ వాళ్ళే సొంతం చేసుకునే పనిలో ఉన్నారు. కాగా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎలా అయితే తీసుకుంటున్నారో ఈ మధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ కాంట్రవర్సీలు కూడా తక్కువ రేంజ్ లో రావడం లేదు.

rakul preet singh uncle filed a case on netflix and here is what netflix said

అలా కొన్నాళ్ల కితమే పలు వెబ్ సిరీస్ లు సినిమాల పరంగా కొంచెం నెటిజన్స్ నుంచి అసహనం నెగిటివ్ ట్రెండ్ లు కూడా ఎదుర్కోవడంతో మార్పులు చేర్పులు కూడా నెట్ ఫ్లిక్స్ వారు చేశారు. ఇక ఇవి సెటిల్ అయ్యాయి అనుకుంటే బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు జాకీ భగ్నానీ, వాషు భగ్నానీ నెట్ ఫ్లిక్స్ తమని మోసం చేసింది అని కేసులు వేశారు. కాగా జాకీ భగ్నానీ అనే అతను స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి భర్త కాగా వాషు భగ్నానీ ఆమెకి మావయ్య.

అయితే దర్శకుడు అలీ అబ్బాస్ బాలీవుడ్ చిత్రం బడేమియా చోటేమియా సినిమా విషయంలో తొమ్మిదిన్నర కోట్లు మోసం చేసారని ఆరోపించగా తాజాగా బాలీవుడ్ లో మరో ట్విస్ట్ బయటకి వచ్చింది. జాకీ భగ్నానీ తండ్రి నెట్ ఫ్లిక్స్ మొత్తంగా మూడు సినిమాలకి గాను తమకి 47.37 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మోసం చేసింది అని వారు కేసు వేసారట.

rakul preet singh uncle filed a case on netflix and here is what netflix said

హీరో నెంబర్ 1, మిషన్ రాణి గంజ్ అలాగే బడే మియా చోటే మియా అనే మూడు సినిమాలకి గాను వారు ఇంకా తమని 47 కోట్లకి పైగా బకాయిలు ఇవ్వలేదని కేసు పెట్టారట. అయితే ఇక్కడ మూడు సినిమాలు కూడా ప్లాప్ గానే నిలిచాయి. మరి దీనిపై నెట్ ఫ్లిక్స్ ఈ కేసుని కొట్టి పారేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

తాము విష్ణు భగ్నానీకి కానీ వారి నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ కి గాని ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదు అని మా దగ్గర పక్కాగా ఉన్నాయని నెట్ ఫ్లిక్స్ సైడ్ నుంచి వాదనలు వినిపిస్తున్నాయట. దీనితో ఈ అంశం మరో ట్విస్ట్ గా మారింది. ఇలా రకుల్ భార్య అలాగే మావయ్య ఇద్దరూ భారీగా నష్టాలు చూసినట్టుగా అర్ధం అవుతుంది. మరి అంతిమంగా ఎవరు కేసు గెలుస్తారో చూడాలి.

ఈ మధ్య కాలంలో ఓటిటిలు కమర్షియల్ గానే ఉంటున్నాయి. ఏమాత్రం సినిమా ఫలితం తేడాగా వచ్చినా ఆ సినిమాని స్ట్రీమింగ్ చేసేందుకు ఇష్టపడకపోగా సదరు నిర్మాతల నుంచి రివర్స్ లో డబ్బులు అడిగే పరిస్థితులు వచ్చేసాయి. దీనితో ఇదే కోణంలో మూడు ప్లాప్ సినిమాల విషయంలో నెట్ ఫ్లిక్స్ కూడా గట్టిగా నిలబడినట్టుగా తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X