14 గంటలపాటు నీళ్లలోనే రకుల్ ప్రీత్.. అలాంటి సీన్ కోసం ఎంత కష్టపడిందంటే?
ఆర్మీ ఫ్యామిలీకి చెందిన పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్ పూర్తి చేశాక కేవలం పాకెట్ మనీకోసం హీరోయిన్ గా చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకుంది. అనంతరం మోడలింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో హీరోయిన్ గా కెరటం మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా హిందీ చిత్రాలు చేస్తున్న ఈ పొడుగు కాళ్ల సుందరి నీళ్లలో ఏకంగా 14 గంటలు ఉందట. ఎలాంటి సీన్ కోసం రకుల్ అలా చేసిందనే విషయం ఆసక్తిగా మారింది.
రకుల్ సినిమాలు:టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో అంతగా సినిమాలు చేయట్లేదు. ఇటీవల బూ అనే ఓటీటీ మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు భారతీయుడు 2, ఆయాలాన్ సినిమాలతోపాటు హిందీలో ఐ లవ్ యు అనే మూవీ చేసింది. భారతీయుడు 2 దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఆయాలాన్ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది.

అందులో స్ట్రీమింగ్:ఇక త్వరలో ఐ లవ్ యు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ కు జోడీగా పావెల్ గులాటి నటించారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా కూడా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనే రానుంది. జియో సినిమాలో జూన్ 16 నుంచి స్ట్రీమింగా కానుంది.

నెల రోజులపాటు:ఐ లవ్ యు సినిమాలో నీటి అడుగున రకుల్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. రెండు నిమిషాల 30 సెకన్లపాటు సీన్ చేసేందుకు నీటి అడుగున ఉండాల్సి వచ్చింది. అందుకోసం రకుల్ చాలా కష్టపడింది. "నేను నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. నీటి లోపల టెన్షన్ పడకూడదు. అందుకోసం నెల రోజులపాటు కఠినమైన శిక్షణ తీసుకున్నాను" అని రకుల్ తెలిపింది.

రెండు సెషన్స్:"స్కూబా శిక్షకుడు అజహాన్ అడేన్ వాలా అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం శిక్షణ ఇచ్చారు. నీటి అడుగున పట్టు కోల్పోకుండా ఎలా ఉండాలో నేర్పించారు. ఈ సీక్వెన్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు చిత్రీకరించారు. పగలు, రాత్రి రెండు సన్నివేశాల కోసం నీటి అడుగున 14 గంటలు షూట్ చేయాల్సి వచ్చింది. అందుకే నేను రెండు సెషన్స్ పని చేశాను" అని రకుల్ చెప్పుకొచ్చింది.

వేడి నీళ్లు పోస్తూ:"రోజంతా నీటిలో ఉండటం అంటే సవాలుతో కూడుకున్న విషయమే. నా శరీరం చల్లబడకుండా ఉండేందుకు వాళ్లు ప్రతి షాట్ గ్యాప్ లో నాపై వేడి నీళ్లు పోస్తూ ఉన్నారు. అయితే నీటిలో క్లోరిన్ కారణంగా కళ్లు మంటలు పుట్టాయి. ఈ ఛాలెంజ్ ను నేను నిజంగా ఆస్వాదించాను. నన్ను నేను దృఢ పరుచుకునేందుకు ఇది ఎంతగానో సహాయపడింది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునేందుకు శారీరక శిక్షణ తీసుకున్నాను" అని రకుల్ పేర్కొంది.


Click it and Unblock the Notifications











