Unstoppable 3 లో రామ్ చరణ్? బాలయ్యపై ప్రశంసల వర్షం.. ఆకాశానికి ఎత్తేసిన చెర్రీ
RRR సినిమాతో ఊహించని స్థాయికి వెళ్లి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆస్కార్ వేడుకల సందర్భంగా ముందుగానే అమెరికా వెళ్లి RRR సినిమాను రామ్ చరణ్ ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక పాపులర్ అమెరికన్ న్యూస్ ఛానెళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈ మెగా హీరో. అంతేకాకుండా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్సుకు ప్రజెంటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. అయితే ఇటీవల జరిగిన గుడ్ మార్నింగ్ అమెరికా ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత నందమూరి బాలయ్య బాబు, అన్ స్టాపబుల్ షోపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు రామ్ చరణ్.
నందమూరి నటసింహం హోస్ట్ గా అదరగొట్టిన టాక్ షో అన్ స్టాపబుల్. ఇటీవలే ఫిబ్రవరి 10న ఈ టాక్ షో రెండో సీజన్ ఎంతో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రారంభం అయిన ఈ రెండో సీజన్ లో ఎంతో మంది స్టార్స్ సందడి చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ సెన్సేషన్ కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ అంతకు మించి అనేలా జరిగింది.

బాలయ్య బాబు హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ రెండో సీజన్ ను పవన్ కల్యాణ్ తో ముగించారు. ఆ ఎపిసోడ్ కు ముందు భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్, పవన్ కల్యాణ్ రెండు ఎపిసోడ్స్ లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరోక్షంగా పాల్గొన్నాడు. అటు ప్రభాస్, ఇటు బాబాయ్ పవన్ కల్యాణ్ తో ఫోన్ ద్వారా మాట్లాడి భాగమయ్యాడు. ఇక రామ్ చరణ్ తో ప్రభాస్ సీక్రెట్ అన్నావ్.. నీ సీక్రెట్ దాచావ్ అంటూ బాలయ్య సరదాగా ఆటపట్టించాడు. అయితే ఈ షోకి రామ్ చరణ్ వస్తే బాగుండు అని అనుకున్న మెగా ఫ్యాన్స్ లేకపోలేదు. ఇదిలా ఉంటే RRR కోసం అమెరికా వెళ్లిన రామ్ చరణ్ కు అక్కడి మీడియా ప్రతినిధుల నుంచి అన్ స్టాపబుల్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
గుడ్ మార్నింగ్ అమెరికా ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత అక్కడి అభిమానులు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో గురించి అడిగారు. "నిజంగా బాలయ్య గారు అన్ స్టాపబుల్. ఆయన హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో రేటింగ్స్, టీఆర్పీలు ఆకాశమంతా ఎత్తులో ఉన్నాయి. నంబర్ వన్ ట్యాగ్ ను ఆ షో సంపాదించుకుంది. ఒక వేళ నాకు ఆ షోలో పాల్గొనే అవకాశం వస్తే నేను వెళ్లేందుకు సిద్ధంగా, ఎంతో ఇష్టంగా ఉన్నాను" అని రామ్ చరణ్ తెలిపాడు. చెర్రీ మాటలు చూస్తుంటే అన్ స్టాపబుల్ సీజన్ 3లో బాలయ్య, రామ్ చరణ్ అలరిస్తారని అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











