పవన్ సింగపూర్ సీక్రెట్ లీక్ చేసిన చరణ్.. మెగా ఫ్యామిలీపై బాలయ్య ఊహించని కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య కూడా ఒక మంచి అనుబంధం ఉంది అని అందరికీ తెలిసిన విషయమే. చాలా సందర్భాల్లో ఒకరి గురించి మరొకరు మాట్లాడుతూ ఉంటే ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేవి. అయితే బాలయ్య ద్వారా మరోసారి వీరి మధ్యలో ఉన్న అనుబంధం గురించి అభిమానులకు ఎంతగానో అర్థమైంది. ఇక రామ్ చరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ సింగపూర్ సీక్రెట్ అంటూ మాట్లాడిన విధానం కూడా హైలెట్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

గ్రాండ్ గా పవన్ ఎపిసోడ్
అన్ స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా పాల్గొని తన జీవితంలోని ఎన్నో విషయాల గురించి బాలకృష్ణతో షేర్ చేసుకున్నారు ఇక ఈ షోలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. మొత్తానికి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఈ ఎపిసోడ్ గ్రాండ్ గా స్ట్రీమింగ్ చేశారు. ఇక ముందు రోజు సోషల్ మీడియాలో కూడా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

రామ్ చరణ్ కు బాలయ్య ఫోన్
ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్న బాలకృష్ణ రామ్ చరణ్ తో ఉన్న అనుబంధం గురించి కూడా అడిగారు. అంతే కాకుండా రామ్ చరణ్ కు ప్రత్యేకంగా ఫోన్ చేసిన బాలకృష్ణ ఏదైనా సీక్రెట్ చెప్పాలి అని చాలా మాట్లాడారు. అంతే కాకుండా మీ ఇద్దరి మధ్యలో జరిగిన అల్లరి విషయం గురించి కూడా చెప్పాలని అడగడంతో రామ్ చరణ్ తెలియజేశాడు.

సింగపూర్ సీక్రెట్
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఒకసారి బాబాయ్ నేను ఇద్దరం కలిసి సింగపూర్ కి వెళ్ళాము. అప్పుడు మా అమ్మ వాళ్లు కూడా ఎవరూ లేరు. ఇక అప్పుడు నేను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సింగపూర్లో ఏది దొరికితే అది తినేశాను. దీంతో కొంత సేపు అయిన తర్వాత బాబాయ్ పవన్ కళ్యాణ్ నరకం చూపించాను.. అని చరణ్ అన్నాడు.

అల్లరి చేస్తూ ఉంటే..
ఏది పడితే అది తినడంతో ఆరోగ్యం కొంత అప్సెట్ అయ్యింది. వాంతులు చేసుకున్నాను దీంతో ఆయనే మొత్తం క్లీన్ చేశారు. నన్ను చాలా బాగా చూసుకునేవారు. ఇక నేను ఆ విధంగా అల్లరి చేస్తూ ఉంటే మాత్రం ప్రతిసారి నన్ను కంట్రోల్ చేయడానికి ఆయన ఒక పని చేసేవారు. అసలు కొట్టేవారు కాదు కానీ యోగ అలాగే మెడిటేషన్ ఇలాంటివి అలవాటు చేసేవారు. నేను ఒక పది రోజుల వరకు ఆయన చెప్పిన పనులు చేసే వారిని. ఆ తర్వాత మళ్లీ మర్చిపోయేవాడిని అని అన్నారు.

బాలకృష్ణ కామెంట్
అలాగే బాలకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అనుబంధాన్ని చూసి ఊహించిన విధంగా స్పందించారు. చాలా క్యూట్ ఫ్యామిలీ అని కూడా అన్నారు. ఫైనల్ గా రామ్ చరణ్ కు ఏదైనా చెప్పాలని అనుకుంటున్నావా అని బాలయ్య బాబు ఫోన్ పవన్ కళ్యాణ్ కు ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ సింపుల్ గా జాగ్రత్తరా.. అంటూ నవ్వుతూ చెప్పాడు. దీంతో బాలయ్య బాబు కూడా చిన్న స్మైల్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











