Game Changer OTT Release: 'గేమ్ ఛేంజర్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..రామ్ చరణ్ మూవీ ఎందులో అంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ఎన్నో అవాంతరాలను దాటుకుని సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్‌డ్ టాక్ కారణంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబరచలేకపోతోంది. అయినప్పటికీ పడుతూ , లేస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తోంది గేమ్ ఛేంజర్. ఈ రిజల్ట్ నేపథ్యంలో రామ్ చరణ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.
గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు దిల్‌రాజు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు దిగ్గజ దర్శకుడు శంకర్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని టాక్. నైజాంలో రూ. 43 కోట్ల బిజినెస్, ఆంధ్రాలో రూ.75 కోట్లు , సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. మొత్తంగా ఒక్క ఆంధ్రాలోనే ఈ సినిమా 100 కోట్ల మేర బిజినెస్ చేసుకొన్నది. ఇక నైజాంతో కలిపి 145 కోట్ల రూపాయల బిజినెస్‌ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకుంది గేమ్ ఛేంజర్. ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించాలంటే.. కనీసం 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను విలువ కట్టారు ట్రేడ్ పండితులు.
మిక్స్‌డ్ టాక్‌కు తోడు ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా సినిమాను చంపోద్దని విజ్ఞప్తి చేశారంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. ఇంతటి టఫ్ ఫైట్‌లోనూ రామ్ చరణ్ తన స్టార్‌డమ్‌తో సినిమాను భుజాలపై మోస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 12వ రోజు రూ. 1.23 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ సినిమా రూ.130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
మరోవైపు.. గేమ్ ఛేంజర్ కోసం ఓటీటీ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ .. గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందట. ఫిలింనగర్‌లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి తెలుగు సహా అన్ని భాషలు కలిపి గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులను దాదాపు రూ. 104 కోట్లకు అమెజాన్ చేజిక్కించుకుందట. నిబంధనల ప్రకారం.. థియేటర్‌లో రిలీజైన 5 వారాల తర్వాత ఏ సినిమా అయినా ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. దీనిని బట్టి ఫిబ్రవరి 14 లేదా 15వ తేదీల్లో గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ అన్నది ముందే జరగొచ్చు లేదంటే మరింత ఆలస్యం కావొచ్చు. ఏది ఏమైనప్పటికీ త్వరలోనే గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











