OTT: రాజమౌళి డాక్యుమెంటరీపై రామ్ చరణ్ రివ్యూ.. జక్కన్న గురించి రామరాజు ఏమన్నాడంటే?
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే చాలా మంది ఒక్క బాలీవుడ్ సినిమా ఒక్కటే అన్నట్టుగా చెప్పేవారు. అటు నార్త్ సైడ్ వెళితే తెలుగు సినిమాకి తెలుగు సినిమాకే కాదు తెలుగు నటులకి కూడా సరైన గుర్తింపు లేదు కదా మద్రాసిలు అంటూ పిలిచే వారని మెగాస్టార్ నటుడే వాపోయాడు. కానీ అలాంటి స్టేజ్ నుంచి ఇపుడు ప్రపంచ పటంలోనే తెలుగు సినిమా కానీ ఇండియన్ సినిమా కానీ ఎలాంటి స్టేజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కాగా ఇందుకు మూల కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది తప్పకుండా మన తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. తన విజన్ తో బ్రహ్మాండమైన విజువల్స్, ఎమోషనల్ టేకింగ్ తో ప్రపంచ సినిమానే మన తెలుగు సినిమా కోసం మాట్లాడేలా చేసాడు. ఇలాంటి జక్కన్నకి మరింత గౌరవాన్ని అందిస్తూ రీసెంట్ గా ప్రపంచ నెంబర్ 1 స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఒక క్రేజీ డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసుకొచ్చారు.

ఇండియన్ దర్శకుల్లో మొట్టమొదటి సినిమాగా ఇది నేరుగా నెట్ ఫ్లిక్స్ లో ఈ ఆగస్ట్ 2 నుంచి అందుబాటులోకి వచ్చింది. కాగా ఇందులో వచ్చాక ఒకింత మిక్స్డ్ రెస్పాన్స్ ని ఈ ఓటిటి చిత్రం అందుకుంది. అలాగే చాలా మంది ప్రముఖులు కూడా ఈ చిత్రం కోసం ప్రశంసలు కురిపించారు. అయితే ఈ వెబ్ చిత్రంలో కనిపించిన గ్లోబల్ హీరో తన రామరాజు, తన మగధీర రామ్ చరణ్ లేటెస్ట్ గా తన రివ్యూ అందించడం వైరల్ గా మారింది.
కాగా రామ్ చరణ్ ఈ డాక్యుమెంటరీ కోసం మాట్లాడుతు రాజమౌళి గారి కథనం.. సినిమా పట్ల తన అకుంఠిత అంకిత భావం, తన క్రాఫ్ట్స్ పై తన పట్టు తరాలకి నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అని తెలిపాడు. అలాగే నెట్ ఫ్లిక్స్ వారు అందించిన ఈ చిత్రం రాజమౌళి మహత్తర కెరీర్ కి ఒక ఘనమైన నివాళి అంటూ రామ్ చరణ్ కొనియాడుతూ తన మార్క్ రివ్యూని అందించాడు.
దీనితో ఈ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. కాగా ఈ వెబ్ చిత్రంలో రామ్ చరణ్ సహా తన RRR నటుడు జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాహుబలి ప్రభాస్ లు కూడా కనిపించి కీలక కామెంట్స్ చేశారు. ఇంతేనా రాజమౌళి కోసం హాలీవుడ్ దర్శకుడు అవతార్, ఆవెంజర్స్ దర్శకుడు జామ్ కామెరాన్ ఇంకా జో రస్సో లాంటి దర్శకులనే నెట్ ఫ్లిక్స్ వారు రంగంలోకి దింపారు.
ఇలా రాజమౌళికి అయితే నెట్ ఫ్లిక్స్ మాత్రం సాలిడ్ ట్రిబ్యూట్ ని జక్కన్నకి అందించారని చెప్పాలి. కాగా ఇపుడు రాజమౌళి అయితే తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనుండగా ఇది మాత్రం హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కనుంది అని ఆల్రెడీ టాక్ ఉంది. దీనితో ఈ సినిమా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ ని సెట్ చేయవచ్చనే చాలా మంది ఆశిస్తున్నారు. మరి ఈ అవైటెడ్ సినిమాతో జక్కన్న ఎలాంటి రేంజ్ కి వేళ్తాడో డెఫినెట్ గా ఆగి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











