Game Changer OTT release: ఓటీటీలోకి'గేమ్ ఛేంజర్'.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్?
Game Changer OTT release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer ). సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన అవుతున్న మిక్స్‌డ్ టాక్ కారణంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రదర్శన అందుకోలేకపోయింది. తాజాగా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది.
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, బ్రహ్మానందం, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల వంటి ఇతరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మించారు. దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు. ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత రామ్ చరణ్ సోలో హీరోగా రావడం, దిగ్గజ దర్శకుడు శంకర్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ స్ట్రెయిట్ గా వచ్చిన తెలుగు సినిమాలో వచ్చిన గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రామ్ చరణ్ కథ విషయానికి వస్తే..రామ్‌నందన్ (రామ్‌చరణ్) ఓ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటించారు. కాలేజీలో సమయంలో రామ్ నందన్ ప్రేమించిన దీపిక (కియారా అడ్వాణీ) కోసం వ్యక్తిత్వం మార్చుకుంటారు. తన ప్రేమించుకుని దీపిక కోసం రామ్ నందన్ కోపాన్ని తగ్గించుకుంటాడు. ఆమె కోసమే ఐఏఎస్ అవుతాడు. అలా.. వైజాగ్ కలెక్టర్‌గా వస్తాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య), అతని గ్యాంగ్‌తో యుద్ధం మొదలవుతుంది. బొబ్బిలి మోపిదేవి తండ్రే ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్). ఈ క్రమంలో బొబ్బిలి మోపిదేవీ సీఎం పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు. ఈ క్రమంలో ఐఏఎస్ రామ్‌నందన్ అడ్డురావడం. అభ్యుదయ పార్టీ, అప్పన్న (రామ్‌చరణ్), పార్వతి (అంజలి)బ్యాక్ రౌండ్ ఏంటీ? అనే కథాంశం.
ఈ మూవీలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా ఫిబ్రవరి 07 నుంచి అమెజాన్ ప్రైమ్ సోషల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. కాగా థియేటర్లలో విడుదలైన తర్వాత నెల రోజుల ముందే గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











