Game Changer: ఓటిటిలోకి గేమ్ ఛేంజర్.. మెగా ఫ్యాన్స్‌ను మళ్లీ నిరాశపరిచిన శంకర్, దిల్ రాజు!
ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన పలు పాన్ ఇండియా సినిమాలు మెయిన్ గా మన టాలీవుడ్ బిగ్ స్టార్స్ నుంచి వచ్చినవి ఏ రేంజ్ లో అదరగొట్టాయో అందరికీ తెలిసిందే. వారిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర ఆ తర్వాత గత ఏడాదికి బిగ్గెస్ట్ హిట్ గా మారిన పుష్ప 2 లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇలా అందరి టాప్ స్టార్స్ భారీ హిట్స్ కైవసం చేసుకున్నారు.
ఇక ఇదిలా ఉండగా ఈ ఏడాదిలో మరో టాప్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా గేమ్ ఛేంజర్ తో మొదటి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా అనూహ్యంగా డిజాస్టర్ అయ్యింది. మెయిన్ గా తెలుగు విపరీతంగా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, పైగా ఫుల్ క్లారిటీతో కూడిన ప్రింట్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన రోజునే బయటకి రావడం పెద్ద దెబ్బగా మారింది.

దీనితో గేమ్ ఛేంజర్ కి భారీ డ్యామేజ్ జరిగింది. కాగా కొన్ని సీన్స్ ని తగ్గించి ఓ పాటని కూడా యాడ్ చేసి విడుదల చేశారు. అయినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఇక ఎట్టకేలకి సినిమా నెల రోజుల్లోనే ఓటిటి దర్శనం కూడా ఇచ్చేసింది. కాగా ఈ సినిమాని పాపులర్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో నేడు ఫిబ్రవరి 7 నుంచే పాన్ సౌత్ భాషల్లో వచ్చేసింది.
అయితే ఈ ఓటిటి రిలీజ్ కూడా ఆడియెన్స్ ని ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది అని చెప్పక తప్పదు. కాగా ఒరిజినల్ గా సినిమా 2 గంటల 42 నిమిషాల మేర మొదటిగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తే తర్వాత 2 గంటల 37 నిమిషాల రన్ టైం తో అప్డేట్ చేశారు. కానీ ఇపుడు ఓటిటి లో కూడా ఇదే 2 గంటల 37 నిమిషాల తోనే తీసుకొచ్చారు.

దీనితో పలు కీలక సీన్స్ మెయిన్ గా ప్రీ క్లైమాక్స్ లో చరణ్, అంజలిపై సన్నివేశాలు కూడా తీసేసారు. ఆల్రెడీ థియేటర్స్ లోనే కట్ చేశారు, ఓటిటిలో కూడా ఇలానేనా అని అంతా డిజప్పాయింట్ అవుతున్నారు. నిజానికి ఈ సినిమా ఏకంగా 5 గంటల ఫుటేజ్ వచ్చింది అని దర్శకుడు శంకర్ ఆ మధ్య చెప్పారు.
కనీసం అంత కాకపోయినా మూడు గంటల రన్ టైం లో పుష్ప 2 తరహాలో తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుకున్నారు కానీ ఫైనల్ గా అదే ప్లాప్ వెర్షన్ ని తీసుకొచ్చారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హాట్ బ్యూటీ కియారా అద్వానీ కూడా హీరోయిన్ గా నటించగా థమన్ ఎస్ సంగీతం అందించాడు. అలాగే నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ లో 50వ సినిమాగా వారి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











