Game Changer OTT: దిమ్మతిరిగే రేట్ కు గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లంటే?
Game Changer OTT: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయాయి. ఇంతకీ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఎన్ని కోట్టు ఖర్చు వేచించారు. వివరాల్లోకి వెళితే..
గ్లోబల్ స్టార్ రాంచరణ్, అందాల భామ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న మూవీ ' గేమ్ ఛేంజర్'. ఈ మూవీని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా అప్డేట్స్ కు మెగా ఫ్యాన్స్ నుంచి కేజ్రీ రెస్పాన్ వస్తుంది. ఇటీవల విడుదలైన సెకండ్ సింగిల్ 'రా మచ్చా మచ్చా' పాటకు మంచి స్పందన వచ్చింది. వీటితో ఫ్యాన్స్ మస్తు ఖుషీలో ఉన్నారు. దీంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సాంగ్ ను డైరెక్టర్ శంకర్ సాంగ్స్ తెరకెక్కించడం కోసం దాదాపు రూ.90 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే.. జరగండి జరగండి ఒక్క సాంగ్ కోసం రూ.16 కోట్లు వెచ్చించారట. భారీ విజువల్స్ తో వచ్చే గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది.

సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అమెజాన్ ప్రైమ్, జీ స్టూడియో కొనుగోలు చేసింది. అందుకు రూ.160 కోట్లు వెచ్చించి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎన్నో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడగా ఆఖరుకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











