Peddi OTT: రామ్ చరణ్ ‘పెద్ది'కి రికార్డు డీల్.. డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లంటే?
Peddi OTT: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా కాంబో మూవీ పెద్ది (Peddi). ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్ లో మరో కీలక మైలురాయిగా మారబోతున్నది. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. చివరిగా వచ్చిన గేమ్ ఛేంజర్ (Game Changer) ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, అంతకుముందు RRR తో వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే రేంజ్ హైప్‌ను 'పెద్ది'తో మళ్లీ తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకీ రామ్ చరణ్ మూవీ డిజిటల్ రైట్స్ కు ఎన్ని కోట్లంటే?
డైరెక్టర్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఒక రా మాస్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో స్టైలిష్‌తో పాటు రగ్గుడ్ మాస్ ప్యాకేజీగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఓటీటీ రైట్స్‌కే రూ.115 కోట్లు?
తాజాగా 'పెద్ది' నాన్-థియేట్రికల్ బిజినెస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ టాక్ ప్రకారం పెద్ది మూవీకి సంబంధించిన OTT రైట్స్ ఇప్పటికే దాదాపు రూ.115 కోట్లకు అమ్ముడయ్యాయట. ఆడియో హక్కులు మరో రూ.18 కోట్లకు క్లోజ్ అయినట్లు సమాచారం. ఇంకా శాటిలైట్, హిందీ శాటిలైట్ డీల్స్ మిగిలి ఉన్నాయట. ఇవన్నీ పూర్తయితే పెద్ది మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ రూ.150-170 కోట్ల రేంజ్‌ను దాటే అవకాశం ఉందని అంచనా.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే... షూటింగ్ ఇంకా పూర్తికాకముందే ఇంత భారీ డిజిటల్ డీల్ క్లోజ్ కావడం ఇండస్ట్రీలో అరుదైన విషయం. పలు OTT ప్లాట్‌ఫామ్స్ పోటీపడగా, అన్ని భాషల డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ ( Netflix) సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది రామ్ చరణ్ పాన్ ఇండియా మార్కెట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో మరోసారి రుజువు చేస్తోంది. ఇప్పటికే రిలీజైన 'పెద్ది' ఫస్ట్ షాట్ అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పించింది. ఇక 'చికిరి' సాంగ్ అయితే దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల వ్యూస్, లక్షలాది రీల్స్‌తో ఈ పాట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
రిలీజ్‌పై భారీ అంచనాలు
ఇప్పటికే మేకర్స్ ఏప్రిల్ 30 విడుదల లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా ఉంటుందని అంచనా. మెగా ఫ్యాన్స్ మధ్య "ఇది కదా మా చెర్రీ రేంజ్" అంటూ కామెంట్లు ట్రెండ్ అవుతున్నాయి. 'పెద్ది' రామ్ చరణ్ కెరీర్‌లో మరో బిగ్ టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్నది ఇప్పుడు సినీ వర్గాల ఆసక్తికర ప్రశ్న. అభిమానులు మాత్రం 2026 సమ్మర్ కోసం ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు. ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











