Bigg Boss బ్యూటికి ఓటేయ్యండి.. రొమాంటిక్ ఫోటోతో రాంగోపాల్ వర్మ ట్వీట్
బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో మూడో వారం ఎలిమినేషన్ రంజుగా మారింది. ఈ వారం ఇంటిలో జరిగిన నామినేషన్ ప్రక్రియలో భారీ వాగ్వాదం చోటుచేసుకొన్నది. వాడివేడిగా జరిగిన నామినేషన్ ప్రక్రియ అనంతరం మొత్తం తొమ్మిది మందిని నామినేట్ చేసినట్టు ప్రకటించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న వారిలో వసంతి, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి రావు, నేహా చౌదరీ, ఇనయ సుల్తానా, శ్రీహాన్, రేవంత్, గీతూ రాయల్ ఉన్నారు.
మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ కీలకంగా మారడంతో తనకు సన్నిహితురాలైన ఇనయ సుల్తానాకు మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. మీరు ఇనయ సుల్తానాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. అందుకు మీరు డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో Bigg Boss Non Stop అని సర్చ్ చేయండి. ఆ తర్వాత నామినేషన్‌లో ఉన్న ఇనయ సుల్తానా ఫోటోపై క్లిక్ చేసి 10 ఓట్లు వేయండి. ఆ తర్వాత 7288877614 నంబర్‌కు 10 మిస్డ్ కాల్స్ చేయండి అంటూ ఆర్జీవి ట్వీట్‌లో తెలిపారు. అలాగే హాట్ స్టార్ లింక్‌ను ఇన్స్‌టాగ్రామ్ లింక్‌ను షేర్ చేశాడు.

రామ్ గోపాల్ వర్మ షేర్ చేసిన ఇన్స్‌టాగ్రామ్‌లో ఇనయ సుల్తాన్‌తో కలిసి రొమాంటిక్‌గా కనిపించాడు. ఇన్స్‌టాగ్రామ్‌లో రాంగోపాల్ వర్మ గురించి ఇనయ పోస్టు పెడుతూ.. స్పెషల్ రిలేషన్‌షిప్ ఎప్పటికీ ప్రేమ కాదు. అంతకంటే అమూల్యమైనది. మీతో మాట్లాడుతుంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. అయితే మీరే నా జీవితంలో కీలకమైన వ్యక్తి అని చెప్పను. కానీ మీరు ఎప్పటికీ అలానే ఉంటారు అని రాశారు.


Click it and Unblock the Notifications











