Shapadham: ఫలించని ఆర్జీవీ వ్యూహం.. శపథం చేసి తోక ముడిచిన డైరెక్టర్
రకరకాల జోనర్లలో గొప్ప గొప్ప చిత్రాలు చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. కెరీర్ ఆరంభంలోనే ట్రెండ్ సెట్టింగ్ మూవీలు చేసిన ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం కాంట్రవర్శీ చిత్రాలతో రచ్చ లేపుతున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పాలిటిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఇలా ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పుడు కూడా పొలిటికల్ మూవీలు ప్లాన్ చేశాడు. కానీ, రాంగోపాల్ వర్మ కెరీర్‌లో బిగ్ షాక్ తగిలింది. దీంతో కొత్త సినిమాపై యూటర్న్ తీసుకున్నాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి మరి!
వైఎస్ జగన్ కథతో మూవీలు : ఇప్పటికే ఏపీ పాలిటిక్స్‌పై ఎన్నో చిత్రాలను రూపొందించిన రాంగోపాల్ వర్మ.. తాజాగా 'వ్యూహం', 'శపథం' అనే చిత్రాలను తీశాడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాలు రూపొందించాడు. ఇందులో 'వ్యూహం' ఇటీవలే విడుదలైంది.

అలా విడుదలైన వ్యూహం : రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రాలకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. దీంతో పలుమార్లు ఈ సినిమాలు వాయిదా పడ్డాయి. చివరికి 'వ్యూహం' సినిమాను ఫిబ్రవరి 23వ తేదీన, 'శపథం' చిత్రాన్ని మార్చి 1న విడుదల చేస్తామని రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. కానీ, అనివార్య కారణాల వల్ల 'వ్యూహం' మూవీని మార్చి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
డిజాస్టర్ మూవీగా వ్యూహం : ఎన్నో నాటకీయ పరిణామాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వ్యూహం' సినిమా అనుకున్న విధంగా టాక్‌ను తెచ్చుకోలేదు. ఫలితంగా ఈ మూవీని చూసేందుకు ఆడియెన్స్ కరువు అయ్యారు. ఇలా నాలుగైదు రోజులు ప్రదర్శించినా ఈ చిత్రానికి కలెక్షన్లు మాత్రం దక్కలేదు. ఫలితంగా 25 కోట్ల రూపాయలతో తీసిన ఈ చిత్రం జీరో షేర్ మూవీగా మారి డిజాస్టర్ అయింది.

ఏపీ ఫైబర్‌నెట్‌లో శపథం : 'వ్యూహం' రిలీజ్ ఫార్ములా బెడిసి కొట్టడంతో రాంగోపాల్ వర్మ 'శపథం' చిత్రాన్ని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదని తెలిసింది. దీంతో ఈ సినిమాను ఏపీ ఫైబర్‌నెట్‌లో వెబ్ సిరీస్‌గా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన మొదటి పార్ట్ 'శపథం ఆరంభం'ను మార్చి 7వ తేదీనే విడుదలైంది. నేటి నుంచి 'శపథం అంతం'ను అందుబాటులోకి తెస్తున్నారు.
రాంగోపాల్ వర్మకు షాక్ : తనదైన చిత్రాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలని ప్లాన్ చేసుకున్న రాంగోపాల్ వర్మ 'వ్యూహం' ఫలించలేదు. దీంతో ఈ దర్శకుడు రూటు మార్చేసి ఏపీ ప్రభుత్వం సహకారంతో ఫైబర్‌నెట్‌లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇలా వర్మకు కోలుకోలేని షాక్ తగిలినట్లైంది. దీనిపై తెలుగుదేశం, జనసేన పార్టీల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వ్యూహం, శపథంలో వీళ్లే : ఇదిలా ఉండగా.. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'శపథం' మూవీలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటించారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు.


Click it and Unblock the Notifications











