నేరుగా ఏపీ ఫైబర్ నెట్‌లో రిలీజ్ కాబోతున్న RGV వ్యూహం శపథం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తీసిన ఈయన ఇప్పుడు మాత్రం వివాదాస్పద చిత్రాలు తీస్తూ ఎప్పుడూ గొడవల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఈయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ.. వ్యూహం శపథం సినిమాను తీశారు. అయితే అనేక గొడవల మధ్య ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్జీవీ తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ సినిమానే వ్యూహం శపథం. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటించారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. అయితే వ్యూహం ఫిబ్వరి 23వ తేదీన విడుదల చేయగా.. ఆ తర్వాత వారం రోజులకే అంటే మార్చి 1వ తేదీన వ్యూహం శపథం చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేధికగా ప్రకటించారు కూడా.

కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అలా మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 8వ తేదీకి వచ్చింది. కానీ ఇప్పుడు మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా వ్యూహం శపథం సినిమాను రెండు పార్టులుగా చేసి.. అంటే వెబ్ సిరీస్ లు గా మార్చి విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.
వ్యూహం శపథం సినిమాను... రెండు పార్టులుగా మలిచారు. పార్ట్ 1గా వ్యూహం శపథం ఆరంభం, పార్ట్ 2గా వ్యూహం శపథం అంతంగా చెబుతున్నారు. అయితే పార్ట్ 1 వ్యూహం శపథం ఆరంభంను ఏపీ ఫైబర్ నెట్ వేధికగా మార్చి 7వ తేదీ రాత్రి 8 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఆ తర్వాతి రోజు అంటే మార్చి 8వ తేదీ రోజు రాత్రి 8 గంటలకు పార్ట్ 2 వ్యూహం శపథం అంతంను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

థియేటర్ లో కాకుండా ఇలా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఈ సినిమాను విడదల చేయబోతున్నామని ఆర్జీవీ ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు. కచ్చితంగా ఈ చిత్రాన్ని చూస్తామంటూ ఆర్జీవీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా రామ్ గోపాల్ వర్మ "వెన్నుపోటు టీంకు మల్టిపుల్ పోట్లు" అంటూ మరో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేస్తున్న ఈ ట్వీట్ల్ నెట్టింట వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











