Skanda OTT: ఓటీటీలోకి స్కంద.. ఎక్కడ? ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఉస్తాద్ రామ్ పోతినేని.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం స్కంద ది అవతార్. ఇక ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 28న రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక ఇటీవల ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వలేదు. ఇక ఇప్పుడు మరో ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే....
యంగ్ హీరో రామ్ పోతినేని... టీనేజ్ లోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో... మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఈ హీరోకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేసుకుంటూ... తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అభిమానుల చేత ఎనర్జిటిక్ స్టార్ అంటూ పిలుపించుకుంటూ... టైర్ 2 హీరోల్లో ఒకరిగా నిలిచాడు.

ఇక రామ్ పోతినేని.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇస్మార్ట్ హీరోగా మారిపోయాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి. ఇక రామ్ పోతినేని ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన సినిమా స్కంద ది అవతార్. ఇక ఈ సినిమాకు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈసారి ఎలాగైన హిట్ అవుతుందని అంతా భావించారు.
స్కంధ మూవీ సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చింది. అంతే కాదు రామ్ కెరియర్ లోనే మొదటి పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. అయితే విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా ఇటీవల ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక అక్టోబర్ 27 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

అయితే ఏమైందో తెలియదుకానీ... ఈ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాలేదు. స్కంద మూవీపై మొదటి నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు... ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ఓటీటీ కొత్త రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించింది ఓటీటీ సంస్థ.
స్కంద మూవీ నవంబర్ 2వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది డిస్ని ప్లస్ హాట్ స్టార్ సంస్థ. ఇక ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా.. సయీ మంజ్రేకర్ కీలక పాత్రలో నటించింది. అలాగే, శ్రీకాంత్, ఇంద్రజ తదితరులు నటించారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











