Skanda OTT: మైండ్ బ్లాకయ్యే ధరకు అమ్ముడుపోయిన స్కంద ఓటీటీ రైట్స్‌... ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

రామ్ పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబోలో వస్తున్న చిత్రం స్కంద. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటు కూడా ఇటీవల ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు నందమూరి నటసింహం బాలయ్య బాబు కూడా హాజరయ్యి సక్సెస్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్... ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్మడుపోయినట్లు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే...

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, టాలీవుడ్ సెన్సెషన్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం స్కంద. ఇక ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ మేజర్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 15 వతేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు.

Ram Pothineni Boyapati Srinivas Skanda Movie OTT Rights Sold Record Price Details Here

ఇక స్కంద మూవీ రిలీజ్ కు సిద్ధం అవుతుండటంతో... చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటు కూడా జరుపుకుంది. ఈ వేడుకకు నటసింహం బాలయ్య హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే స్కంద ట్రైలర్ రిలీజ్ అయింది. అనంతరం తన మాటలతో ఫ్యాన్స్ లో జోరు పెంచారు బాలయ్య.

Ram Pothineni Boyapati Srinivas Skanda Movie OTT Rights Sold Record Price Details Here

ఇప్పుడు స్కంద మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ దిమ్మ తిరిగే రేటుకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఇందులో ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు... అన్ని వర్గాల వారికి నచ్చుతాయని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంటులో బోయపాటి చెప్పుకొచ్చారు.

Ram Pothineni Boyapati Srinivas Skanda Movie OTT Rights Sold Record Price Details Here

స్కంద మూవీ వినాయ‌క‌చ‌వ‌తి కానుక‌గా సెప్టెంబ‌ర్ 15న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుండగా.... ఈ సినిమా డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కులు 45 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు తెలుస్తోంది. స్కంద ఓటీటీ రైట్స్‌ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌, శాటిలైట్ రైట్స్‌ ను స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. రామ్ కెరీర్‌ లోనే అత్య‌ధిక ధ‌ర‌కు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా స్కంద రికార్డు సాధించింది.

Ram Pothineni Boyapati Srinivas Skanda Movie OTT Rights Sold Record Price Details Here

ఇక స్కంద మూవీ ట్రైలర్ లో రామ్ విభిన్న గెటప్స్ లో కనిపించారు. యాక్ష‌న్ మాస్ అంశాల‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్ మేళ‌విస్తూ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే హీరో రామ్ పోతినేని పాన్ ఇండియ‌న్ మార్కెట్‌ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ ప‌తాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, ప్రిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X