OTTలో దుమ్మురేపుతున్న కొత్త మూవీ.. ట్రోల్స్ చేస్తునే చూస్తున్నారుగా!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం స్కంద. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఇటీవల డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయింది. అయితే రికార్డు వ్యూస్ తో ఈ సినిమా దుమ్ము రేపుతోంది. అయితే ఓవైపు నెట్టింట ట్రోల్స్ వచ్చినా సరే.. ఓటీటీలో దుమ్మురేపడం ఆశ్చర్యం. అసలు ఆ ట్రోల్స్ ఏంటి.. రికార్డు వ్యూస్ ఏంటి అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన రీసెంట్ కల్ట్ మూవీ "స్కంద". ఇక ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించగా, శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించాడు. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రిన్స్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా ఎన్నో అంఛనాల నడుమ సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. విడుదల అయిన మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

 Ram Pothineni Skanda Has Become Highest Viewed Tollywood Film in First 24 Hours on Disney Hotstar in 2023

ఇక స్కంద సినిమాకు ఆశించిన స్థాయి కలెక్షన్స్ కూడా రాలేదు. బాక్సాఫీస్ ఈ సినిమా పరాజయం పొందిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్ని ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుంది.

మరోవైపు ఈ సినిమాపై ట్రోలింగ్ కూడా జరుగుతోంది. దర్శకుడు బోయపాటిపై ప్రేక్షకులు ట్రోలింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వేదికగా... బోయపాటిపై మీమ్స్, నవ్వించే పోస్టులు వస్తున్నాయి. బోయపాటి క్రియేట్ చేసిన సీన్లు ఎంత హాస్యాస్పదంగా, లాజిక్ లెస్ గా ఉంటాయో చుడండి అంటూ చాలా మంది మీమ్స్, వీడియోలు పెడుతున్నారు.

సీఎం ఇంట్లో హీరో దిగి సీఎం కూతుర్ని కిడ్నాప్ చేసే స్టుపిడ్ సీన్ చూసి.. ఇది నిజంగా సాధ్యమవుతుందా అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొదటి సీన్‌లో చనిపోయిన వ్యక్తి తర్వాత సీక్వెన్స్‌ లో మళ్లీ కనిపించడం వంటి ఎడిటింగ్ లోపాలు కూడా కొందరు పాయింట్ అవుతు చేసి.. ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే ఇంత ట్రోలింగ్ వస్తున్నప్పటికీ... స్కంద సినిమాకు ఓటీటీలో రికార్డు వ్యూస్ వస్తున్నాయి.

2023లో డిస్నీ+ హాట్‌స్టార్‌లో మొదటి 24 గంటల్లో అత్యధికంగా వీక్షించబడిన టాలీవుడ్ చిత్రంగా స్కంధ నిలిచింది. సినిమా ఎంత చెత్తగా ఉన్నా బోయపాటి శ్రీను సినిమాలు యూట్యూబ్ లో రికార్డ్-బ్రేకింగ్ వ్యూస్ దక్కించుకుంటాయి. అప్పట్లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జనకీ నాయక హిందీలో డబ్ చేసి వదిలేస్తే రికార్డు వ్యూస్ వచ్చాయి. అదే ట్రెండ్ హాట్‌స్టార్‌లో కూడా కనిపిస్తుంది. ఒక పక్క ట్రోల్స్ వస్తునే.. మరొపక్క రికార్డు వ్యూస్ రావడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X