OTTలోకి రీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్... ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో థియేటర్లలో వసూళ్లు విషయంలో మాత్రం వెనకబడింది. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సర్వం సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే....
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను... రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నాడు అనగానే అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే రామ్ కు ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్ లేదు. ది వారియర్ అనే సినిమా చేశాడు కానీ... ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు అనగానే ఎలా ఉంటుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల ఎంట్రీ ఇవ్వడంతో కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అందులో నమ్మకాలు పెట్టేసుకున్నారు.

అలా రామ్ పోతినేని హీరోగా స్కంద అనే సినిమా ప్రేక్షకుల ముందుకు థియేటర్లోకి సెప్టెంబర్ 28వ తేదీన వచ్చింది. ఈ సినిమా బావుందని కొందరు అంటే... బాలేదు అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అంటే ఒక రకంగా సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయితే కలెక్షన్స్ యావరేజ్ గా వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇంకా కొన్నిచోట్ల సినిమా ఆడుతోంది. కలెక్షన్స్ ఆశించిన మేర రాకపోయినా ఓ మాదిరిగా వస్తున్నాయి.
ఇక స్కంద సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 20 రోజులు దాకా పూర్తవుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుంది.. ఎక్కడ రిలీజ్ అవుతుంది.. అని అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ భారీ రేటు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ అందులోనే జరగబోతుందని తెలుస్తోంది. దాదాపుగా అక్టోబర్ 27వ తేదీ నుంచి ఈ సినిమా డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇది అధికారికంగా ఇంకా వెల్లడించలేదు కానీ... దాదాపుగా అదే తేదీన రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మామూలుగా ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం పెద్ద సినిమా అయితే నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ కావాల్సి ఉంటుంది. స్కంద కూడా ఓ మాదిరిగా పెద్ద సినిమా కావడంతో నాలుగు వారాల తర్వాత అంటే అక్టోబర్ 27వ తేదీన దాదాపుగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి మీరు ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే కనుక ఓటీటీలోకి వచ్చాకా ఇంట్లోనే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూసేయండి.


Click it and Unblock the Notifications











