ముందుగానే ఓటీటీలోకి డబుల్ ఇస్మార్ట్.. రామ్ సినిమాను ఎలా చూడాలంటే!

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుని.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న అతడు.. ఈ సారి కచ్చితంగా విజయాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో 'డబుల్ ఇస్మార్ట్' అనే మూవీని చేశాడు.

టాలెంటెడ్ హీరో రామ్ పోతినేనితో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన సినిమానే 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి ఇది సీక్వెల్‌గా వచ్చింది. దీంతో ఆరంభంలోనే దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసుకుని ఇది ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Ram Pothineni Starrer Double iSmart Movie Ott Streaming Date Revealed

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో దీనికి ప్రేక్షకుల నుంచి స్పందన అనుకున్న రీతిలో లభించలేదు. ఫలితంగా ఈ సినిమాకు అనుకున్న విధంగా వసూళ్లు దక్కలేదు. తద్వారా ఇది కేవలం వారం రోజుల్లోనే రన్‌ను ముగించుకుని బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

క్రేజీ హిట్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీపై అంచనాలు భారీగా ఉండడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా భారీగానే వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్‌పై క్రేజీ న్యూస్ లీకైంది.

Ram Pothineni Starrer Double iSmart Movie Ott Streaming Date Revealed

ప్రేక్షకులను ఆశించిన రీతిలో మెప్పించలేకపోయిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమా వీలైనంత త్వరగానే ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే దీన్ని నెల రోజులు కాకుండానే స్ట్రీమింగ్ చేస్తారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. రామ్ సినిమాను సెప్టెంబర్ 12వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకు వస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇదే నిజం అయితే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. పూర్తి స్థాయి మాస్ యాక్షన్‌తో రూపొందిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా, కావ్య థాపర్ హీరోయిన్ చేసింది. అలాగే, అలీ, గెటప్ శ్రీను, షయాజీ షిండేలు కీలక పాత్రలను పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X