Skanda OTT: రామ్ మూవీ ఆ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ అన్ని రోజులకేనా?
గతంలో కంటే ఈ మధ్య కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ కాంబినేషన్లలో సినిమాలు రూపొందుతోన్నాయి. వాటికి మంచి రిజల్ట్‌లు వస్తుండడంతో మరిన్ని ప్రాజెక్టులు కూడా పట్టాలెక్కుతున్నాయి. అలాంటి క్రేజీ మూవీనే 'స్కంద'. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేసిన ఈ చిత్రం ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీంతో ఇది భారీ స్థాయిలో బిజినెస్‌ను కూడా చేసుకుని తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రామ్ పోతినేని - శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమే 'స్కంద'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే కనిపిస్తోంది. దీనికి అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కుతోంది. తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ బాగున్నాయి. దీంతో దీనికి టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ పోతినేని 'స్కంద' మూవీ ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'స్కంద' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే సెప్టెంబర్ 28న విడుదలైన 'స్కంద' అక్టోబర్ చివరి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.

ఇక, బోయపాటి శ్రీను - రామ్ పోతినేని కాంబోలో రూపొందిన 'స్కంద' సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా.. సయీ మంజ్రేకర్ కీలక పాత్రలో నటించింది. అలాగే, శ్రీకాంత్, ఇంద్రజ తదితరులు నటించారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











