ఆ ఓటీటీలోకి తెలుగు శృంగార సినిమా.. ఇద్దరు అబ్బాయిలతో ఒక అమ్మాయి ఘోరంగా!
ఓటీటీ వాడకం పెరిగిన తర్వాత విభిన్నమైన కంటెంట్‌తో రూపొందే చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటిలో బోల్డ్ కాన్సెప్టులతో వచ్చే సినిమాలు చాలానే ఉంటున్నాయి. ఇప్పటికే ఆ తరహా మూవీలు వచ్చి ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు శృంగార సన్నివేశాలతో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'ఎవోల్' (EVOL).
జెన్నిఫర్ ఇమాన్యూయేల్, సూర్య శ్రీనివాస్, శివలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'ఎవోల్'. రామ్ యోగి వెలగపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలతో ఒకేసారి ప్రేమలో పడడం, వాళ్లిద్దరితో కలిసి శృంగారం చేయడం అనే అంశాలతో తెరకెక్కింది. దీంతో ఆరంభంలోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు సెన్సేషన్‌గా మారింది.

తెలుగులో తొలిసారి ఇంత బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన 'ఎవోల్' సినిమాను నేరుగా థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, దీన్ని సెన్సార్ కూడా చేయించింది. అప్పుడు బోర్డు దీనికి ఏ (A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తామని దర్శకుడు రామ్ యోగి వెలగపూడి వెల్లడించాడు.
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'ఎవోల్' సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. సెన్సార్ బోర్డు కొన్ని కీలకమైన సన్నివేశాలను కట్ చేయాలని సూచించడం వల్లే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపించింది. ఇక, ఈ సినిమా ఓటీటీ హక్కులను తీసుకున్న ఆహా సంస్థ.. దీని స్ట్రీమింగ్‌ను మొదలు పెట్టింది.

రామ్ యోగి వెలగపూడి దర్శకత్వంలో, గతంలో తెలుగులో ఎన్నడూ చూడని శృంగార సన్నివేశాలతో నిండిపోయిన కథతో రూపొందిన 'ఎవోల్' సినిమాను ఆహా సంస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనికి అందులో అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం హాట్ టాపిక్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. అదిరిపోయే బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన 'ఎవోల్' మూవీని నక్షత్ర ఫిల్మ్స్ ల్యాబ్స్ నిర్మించగా.. తేడా బ్యాచ్ సినిమా సమర్పించింది. ఈ చిత్రానికి కథ, డైలాగ్స్, స్క్రీన్‍ప్లే, నిర్మాత, దర్శకుడిగా యోగి వెగలపూడి పని చేశారు. ఈ మూవీకి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











