Rama Ayodhya శ్రీరామనవమి కానుకగా ఓటీటీలో రామ అయోధ్య.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

భారతీయుల వందల సంవత్సరాల కల అయోధ్యలో రామాలయ నిర్మాణం. అన్ని వివాదాలను పరిష్కరించుకొని రామజన్మ స్థానంలో బాలరాముడి ఆలయం ఆవిష్కృతమైంది. ఇప్పటికే భక్తులు తండోపతండాలుగా శ్రీరామచంద్రుడిని దర్శించుకొంటున్నారు. అయితే అయోధ్యకు వెళ్లలేని యాత్రికులు, శ్రీరామ భక్తుల కోసం ఓ సినీ ప్రముఖుడు గొప్ప కార్యాన్ని తలపెట్టి అక్కడి విశేషాలను వివరిస్తూ రామ అయోధ్య అనే డాక్యుమెంటరీని రూపొందించారు. శ్రీరామనవమి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీని ఎక్కడ? చూడొచ్చంటే..

భార్గవ పిక్చర్స్, దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ బ్యానర్లపై రూపొందిన రామ అయోధ్య డాక్యుమెంటరీకి జాతీయ అవార్డు గ్రహిత సత్యకాశీ భార్గవ కథ, కథనాలు అందించగా.. కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ డాక్యుమెంటరీని శ్రీరామచంద్రుడి 16 సద్గుణాలను వివరిస్తూ అయోధ్యలో షూట్ చేశారు. అయోధ్య పవిత్రతను వివరిస్తూ.. భక్తులకు తెలియని ఎన్నో విషయాలను ఇందులో ప్రస్తావించినట్టు తెలుస్తున్నది.

Rama Ayodhya Documentary to Streaming date Here is details of Where and When to watch

రామ అయోధ్య డాక్యుమెంటరీ రిలీజ్‌ను పురస్కరించుకొని.. రాముడి సద్గుణాలను వివరిస్తూ.. అయోధ్యలోని ప్రధాన ప్రాంతాలను చూపించాం. ఆ ప్రాంతాల విశిష్టతను కళ్లకు కట్టినట్టు చూపించాలనే ప్రయత్నం మాది. తెలుగు వారికే కాకుండా భారతీయులందరికి నచ్చతుంది అని సత్యకాశి అన్నారు.

అయోధ్య అంటే కేవలం రామమందిరం మాత్రమే కాదు. ఆ ప్రాంతంలో మనకు తెలియని పవిత్ర ప్రదేశాలు, మందిరాలు ఉన్నాయి. అలాంటి పవిత్ర ప్రదేశాలను మా డాక్యుమెంటరీలో చూపించాం. అందరికి ఆదర్శంగా నిలిచిన శ్రీరాముడి గుణగణాలను ప్రస్తుత తరాలకు స్పూర్తిదాయకంగా.. అందరికి సులభంగా అర్ధమయ్యేలా చిత్రీకరించాం అని దర్శకుడు కృష్ణ వెల్లడించారు.

Rama Ayodhya Documentary to Streaming date Here is details of Where and When to watch

శ్రీరామ భక్తులను విశేషంగా ఆకట్టుకొనే పవిత్ర అంశాలతో రాబోతున్న ఈ డాక్యుమెంటరీ శ్రీరామనవవి రోజున అంటే.. ఏప్రిల్ 17వ తేదీన ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 16 ఎపిసోడ్స్ ఉంటాయి. భక్తులు ఈ డాక్యుమెంటరీ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంది అని నిర్మాత, దర్శకులు తెలిపారు.

నిర్మాతలు: సత్యకాశీ భార్గవ, భారవి కొడవంటి

మ్యూజిక్: వందన మజాన్
సినిమాటోగ్రఫి: శైలేంద్ర
ఎడిటింగ్: యాదగిరి-వికాస్
రచన: సత్యకాశీ భార్గవ
దర్శకుడు: కృష్ణ S రామ
ఓటీటీ రిలీజ్: ఆహా
ఓటీటీ రిలీజ్ డేట్: 2024-04-15

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X