Ramarao On Duty OTT: ఆ ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అతడు.. హీరోగా మారిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను సైతం ఖాతాలో వేసుకున్నాడు. మరీ ముఖ్యంగా మాస్ ఇమేజ్‌ను దక్కించుకుని భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక, 'క్రాక్' మూవీ హిట్ తర్వాత రవితేజ మరింత జోష్‌తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. దీంతో ఈ స్టార్ హీరో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ ఏడాది ఆరంభంలో 'ఖిలాడి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. అది పరాజయం పాలైనా ఫ్యూచర్ ప్రాజెక్టులను మాత్రం పట్టాలెక్కిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను చేశాడు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రానికి భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ క్రేజీ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ అత్యధికంగానే జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను జూలై 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే.

 Ramarao On Duty Movie Streaming on Sony LIV From September 15th

క్రేజీ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ అనుకున్నట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. కానీ, ఆరంభంలోనే దీనికి మిక్స్‌డ్ టాక్ రావడం స్పందన కరువైంది. ఫలితంగా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. దీంతో ఏపీ, తెలంగాణలో అంతగా కలెక్షన్లు రాలేదు. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు ఆదరణ కరువైంది. దీంతో ఈ సినిమాకు ముగింపు సమయానికి చాలా తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా ఈ సినిమాకు భారీ నష్టాలను మూటగట్టుకుంది. దీంతో రవితేజకు వరుసగా రెండో పరాజయం ఎదురైనట్లు అయింది.

థియేటర్లలో అంతగా సందడి చేయలేకపోయిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీని త్వరగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు ఎన్నో సంస్థలతో డీల్స్ మాట్లాడారని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ లివ్ సంస్థ ఓ ప్రకటన చేసింది. దీన్ని సెప్టెంబర్ 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అందులో వెల్లడించింది. ఈ మేరకు కొత్తగా రెడీ చేసిన ఓ ట్రైలర్‌ను కూడా సదరు సంస్థ విడుదల చేసింది. ఇక, దీని కోసం మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Ramarao On Duty Movie Streaming on Sony LIV From September 15th

మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మందవ రూపొందించిన సందేశాత్మక మాస్ మూవీనే 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ సినిమాలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో అప్పటి హీరో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాను ఎస్సెల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X