Ramayana OTT Deal: ‘వారాణాసి'ని మించిన రికార్డు డీల్.. నో చెప్పిన ‘రామాయణ' మేకర్స్.. ఎందుకో తెలుసా?

Ramayana OTT Deal: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'రామాయణ' (Ramayana). ఈ మూవీ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌లో రాముడి పాత్రను పరిచయం చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నితేష్ తివారీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంగీత దిగ్గజాలు A. R. రెహమాన్, హన్స్ జిమ్మెర్ స్వరాలు సమకూర్చగా, ఆస్కార్ విజేత సంస్థ DNEG విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు చేపట్టింది. టెక్నికల్‌గా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించబడిన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. భారీ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ ప్రాజెక్ట్ డిజిటల్ హక్కుల విషయంలో మేకర్స్ తీసుకుంటున్న నిర్ణయాలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Ramayana OTT Deal Makers Reject 700 Cr Offer Eye Record 1000 Cr Deal

మైథాలజికల్ ఎపిక్‌ను దర్శకుడు నితీష్ తివారీ రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027లో విడుదల కానుంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయినా ఓటీటీ డీల్ హాట్ టాపిక్‌గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫిక్స్ ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కుల కోసం సుమారు రూ.700 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే ఆశ్చర్యకరంగా, ఈ ఆఫర్‌ను నిర్మాత నమిత్ మల్హోత్రా తిరస్కరించినట్లు సమాచారం.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం సినిమా స్కేల్, పెట్టుబడి అని తెలుస్తోంది. 'రామాయణ' సినిమాను దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, నిర్మాతలు ఓటీటీ హక్కుల ద్వారా మాత్రమే కాకుండా, థియేట్రికల్, శాటిలైట్, అంతర్జాతీయ మార్కెట్‌ల ద్వారా కూడా భారీ ఆదాయం సాధించాలని భావిస్తున్నారు. అందుకే రూ.700 కోట్ల డీల్‌ను చిన్నదిగా భావించి తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇంకా విశేషం ఏమిటంటే.. కేవలం ఓటీటీ ద్వారా రూ.1000 కోట్ల అందుకోవాలని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇది సాధ్యమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'వారాణాసి'. ఈ మూవీ కోసం దాదాపు రూ.600-650 కోట్ల ఓటీటీ డీల్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. రాజమౌళి తన బ్రాండ్‌కు, సినిమాకు ఉన్న గ్లోబల్ క్రేజ్ కారణంగా ఈ స్థాయి డీల్ సాధ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. రాజమౌళి కూడా భారీ మొత్తాన్ని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. 'రామాయణం'విషయంలో అదే స్థాయి నమ్మకం ఓటీటీ సంస్థల్లో ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోంది.

ఇప్పటి వరకు అత్యధిక డిజిటల్ హక్కులు సాధించిన సినిమాల్లో 'పుష్ప 2' వంటి చిత్రాలే రూ.275-300 కోట్ల మధ్య డీల్ సాధించాయి. ఈ నేపథ్యంలో ఒక్క సినిమాకే రూ.500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు పెద్ద రిస్క్‌గా మారవచ్చు. ముఖ్యంగా కంటెంట్, ప్రేక్షకాదరణ, థియేట్రికల్ రన్ ఇవన్నీ పరిశీలించిన తర్వాతే డీల్ ఫైనల్ అవుతుంది.

ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం, 'రామాయణం' మేకర్స్ ఓ కొత్త వ్యూహాన్ని అనుసరించే అవకాశముంది. మొదటి భాగం విడుదలైన తర్వాత దాని రిజల్ట్‌ను బట్టి రెండో భాగానికి డీల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మొదటి భాగం 'బాహుబలి 2', ధురంధర్ 2 స్థాయిలో విజయం సాధిస్తే, అప్పటికి రూ.1000 కోట్ల డీల్ సాధ్యమయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ 'రామాయణ'కు ఆ భారీ డీల్ సెట్ అయితే.. ఓటీటీ చరిత్రలో కొత్త అధ్యాయమనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X