Ramya Krishnan బుల్లితెరపై గ్రాండ్ రీ ఎంట్రీ.. ఓంకార్‌తో కలిసి ఆహా అనిపించనున్న శివగామి
టాలీవుడ్‌లో ఒకప్పుడు రమ్యకృష్ణ టాప్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసింది. సౌత్‌లో రమ్యకృష్ణ తన మార్క్ వేసింది. అయితే ఆమె కెరీర్ బాహుబలికి ముందు.. బాహుబలి తరువాత అన్నట్టుగా మారిపోయింది. శివగామి పాత్రలో రమ్యకృష్ణ అందరినీ ఆశ్చర్యపరిచింది. శివగామి అనే పాత్ర, ఆ పేరు ఓ బ్రాండ్‌లా మారిపోయింది. ఆ కారెక్టర్‌లోని రాజసం, దర్పం, కరుణ, ప్రేమ అన్నీ కూడా రమ్యకృష్ణ చూపించేసింది. తాజాగా లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రమ్యకృష్ణ మరోసారి బుల్లితెరపై ప్రత్యక్షం కానున్నది. ఆ షో వివరాల్లోకి వెళితే.

విపరీతమైన క్రేజ్..
శివగామి పాత్రకు ముందుగా రాజమౌళి ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను సంప్రదించాడు. కానీ వారెవ్వరూ కూడా ఆ కారెక్టర్‌ను చేసేందుకు ముందుకు రాలేదు. చివరగా రాజమౌళి.. రమ్యకృష్ణ వద్దకు వచ్చాడు. ఒక్కసారి ఆమెను ఆ పాత్రలో చూశాక.. తాను ఎవరెవరినో అడిగి ఎంత పెద్ద తప్పు చేశానో అన్నట్టుగా ఫీలయ్యాడట.

ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి..
బాహుబలి తరువాత రమ్యకృష్ణ మళ్లీ అవకాశాలు పెరిగాయి. అత్త, అమ్మగా ఎన్నో పాత్రలు పోషించింది. కానీ అవేమీ కూడా రమ్యకృష్ణకు అంతగా పేరు తీసుకురాలేదు. బుల్లితెరపైనా రమ్యకృష్ణ తన మార్క్ వేసేందుకు చాలానే ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్, సీరియల్స్ అంటూ ట్రై చేసింది.

బుల్లితెరపై..
రమ్యకృష్ఱ బుల్లితెరపై నాగభైరవి అనే ఓ సీరియల్‌ను చేసింది. ఎంతో గ్రాండియర్‌గా నిర్మించిన ఈ సీరియల్‌లో వీఎఫెక్స్ అదిరిపోయింది. అయితే ఈ సీరియల్‌కు అంతగా గుర్తింపు రాలేదు. ముఖ్య పాత్రను పోషించిన రమ్యకృష్ణకు కూడా అంతగా ఉపయోగపడలేదు. బిగ్ బాస్ మూడో సీజన్‌లోనూ నాగార్జున ఓ వీకెండ్ రాకపోవడంతో.. రమ్యకృష్ణ అద్భుతంగా హ్యాండిల్ చేసింది.

ఓంకార్ ప్రయోగం..
బుల్లితెరపై ఓంకార్ చేసినన్ని ప్రయోగాలు ఇంకెవ్వరూ చేసి ఉండారు. ఆటలు, డ్యాన్స్ పోటీలు, పాటలు ఇలా ఏవైనా సరే కొత్తగా ట్రే చేసేందుకు ఓంకార్ ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు ఆహాలో డ్యాన్స్ ఐకాన్ అనే కొత్త షోను ఓంకార్ తీసుకొస్తున్నారు. ఆహాలో రాబోతోన్న ఈ షోకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

ఆమె స్థానంలో..
డ్యాన్స్ ఐకాన్ షోలో ఓ సీనియర్ నటి జడ్జ్‌గా రావాల్సి ఉందట. అయితే ఆమెస్థానంలో రమ్యకృష్ణను తీసుకున్నారట. ఆమెతో పాటు శేఖర్ మాస్టర్ ఉంటాడట. ఇక మెంటర్లుగా శ్రీముఖి, యష్, మోనాల్ వంటి వారిని తీసుకున్నారట. ఆల్రెడీ ఓ ఎపిసోడ్‌ను కూడా షూట్ చేశారట. ఈ ఎపిసోడ్‌కు విజయ్, అనన్య పాండేలు గెస్టులుగా వచ్చారట.


Click it and Unblock the Notifications











