డాన్స్ ఐకాన్ లో శివగామి హంగామా

ఆటా వంటి డాన్స్ ప్రోగ్రామ్స్ తో తెలుగువారిని బుల్లితెరలకు అతుక్కుపోయేలా చేయడమే కాకుండా, ఇండస్ట్రీకి ఎంతో మంది టాలెంటెట్ డాన్సర్లను, నటీనటులను పరిచయం చేసిన ఓంకార్ మరోసారి టాలెంట్ హంట్ కు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆహా వేదికగా అదిరిపోయే స్టెప్పులతో స్టేజ్ ను ఒక ఊపు ఊపేయడానికి కంటెస్టెంట్లు కూడా ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇటీవలే సెప్టెంబర్ 11న ఆహాలో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వగా షోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లైగర్ స్టార్ క్యాస్ట్ విజయ్ దేవరకొండ, అనన్యా పాండే మొదటి ఎపిసోడ్ లో అకడి పకడి సాంగ్ కు కదం తొక్కడమే కాదు, ఇతర కంటెస్టెంట్లలోనూ ఉత్సాహం నింపి సందడి చేశారు.

ఇక శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ తోడవ్వబోతోంది. లేడీ సూపర్ స్టార్ రమ్యకృష్ణ ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించబోతున్నారు. తన అందచందాలతో రెండు దశాబ్దాల పాటూ సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపేసిన రమ్యకృష్ణ బాహుబలి తరువాత అంతర్జాతీయ స్థాయిలో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. డాన్స్ ఐకాన్ ద్వారా ఓటీటీ స్పేస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తున్న రమ్యకృష్ణ ఇక్కడ కూడా తనదైన స్టైల్ లో రప్ఫాడించేందుకు సిద్ధమవుతున్నారు.

Ramyakrishna to judge Dance Ikon

ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన లేడీ సూపర్ స్టార్ డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి ఫార్మాట్ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చేయలేదని, ఈ షో ద్వారా ఎవరూ చూడని ఒక కొత్త రమ్య ని అందరు చూడబోతున్నారని చెప్పారు. అందరూ ఈ షో ని ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రముఖ యాంకర్ శ్రీ ముఖి, యశ్ మాస్టర్, మోనాల్ గజ్జర్ టీమ్స్ కో ఓనర్లుగా వ్యవహరించబోతున్నారు. ఇక షో విన్నర్ కు ఓ పెద్ద హీరోకు కొరియోగ్రాఫీ చేసే అవకాశం ఇవ్వబోతున్నారట. మరి 100 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన ఆహాలో డాన్స్ ఐకాన్ ఇంకెన్ని వండర్స్ సృష్టింస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X