Rana Naidu: అసహ్యించుకుంటున్న వారికి రానా వివరణ.. మళ్ళీ అదే మాట!
బాహుబలి సినిమాతో సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న భల్లాలదేవ్ రానా ఆ తరువాత చాలా రకాల పాత్రలలో కనిపించాడు. కానీ ఆ రేంజ్ లో మాత్రం మళ్ళీ క్లిక్ కాలేదు. ముఖ్యంగా హీరోగా అతను సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. విరాటపర్వం పరవాలేదు అనిపించినప్పటికి అది కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయితే నటుడిగా మంచి గుర్తింపు సంపాదించిన నటుడు రానా దగ్గుబాటి ఇటీవల క్రైమ్ డ్రామా సిరీస్ రానా నాయుడుతో OTT ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సీరీస్ ను 'రే డోనోవన్' అనే అమెరికన్ సిరీస్ ఆధారంగా రూపొందించినవారు. రానాతో పాటు స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ఆన్-స్క్రీన్ తండ్రిగా నటించారు. సెలబ్రిటీలు సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా పేరుగాంచిన రానా నాయుడు జీవితం చుట్టూ ఇది తిరుగుతుంది. ఇక ఈ సీరీస్ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. కొందరు దాని యాక్షన్-ప్యాక్డ్ డ్రామాను ప్రశంసించారు.

మరికొందరు ఇది అతిగా బుతులతో నిండి ఉందని ముఖ్యంగా వెంకటేష్ ఫ్యాన్స్ కు నిరాశను కలిగించే సీరీస్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక విమర్శల కారణంగా రానా ట్విట్టర్‌లోకి లో ఒక వివరణ అయితే ఇచ్చాడు. దీన్ని ఇష్టపడిన వారికి ధన్యవాదాలు అంటూ ఎవరికైనా నచ్చకుంటే మన్నించాలి అని క్షమాపణలు చెప్పాడు.
చాలా వరకు బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ రానా, వెంకటేష్ ఫ్యాన్స్ కు వారి నటన బాగానే ఆకట్టుకుంది. ఇక బోల్డ్ కంటెంట్ ఉన్నందున కొంతమంది అభిమానులు కుటుంబంతో కలిసి చూడకూడదని కూడా రానా మరోసారి సలహా ఇచ్చారు. ఇక రానా నాయుడు సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అవుతోంది. మొదటి స్థానంలో క్రేజ్ అందుకుంటోంది. ఇక భవిష్యత్తులో ఈ సీరీస్ కు సీక్వెల్స్ కూడా ఉంటాయట. మరో మూడు సీజన్స్ వరకు దర్శకులు సూపర్న్ వర్మ, కరణ్ అషుమాన్ కథలను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











