ప్రభాస్ ఎవరు? మహేశ్ బాబు అంటే నమ్రత భర్తనా? రానా బయటపెట్టిన ఆసక్తికర నిజం!

యంగ్ రెబల్ స్టార్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తదనైన సత్తా చాటాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాతి నుంచి పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ చెప్పక్కర్లేదు. తెలుగులో మరో అగ్ర హీరోగా గుర్తింపు పొందాడు మహేశ్ బాబు. బాలనటుడిగా సినిమాల్లోకి ఎరంగప్రవేశం చేసి సూపర్ స్టార్ రేంజ్ సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మహేశ్ బాబుకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ ఇద్దరు అగ్ర హీరోలు తెలియని వారుండరు. కానీ ప్రభాస్ అంటే తెలియని వారు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని తాజాగా బయట పెట్టాడు దగ్గుబాటి రానా.

 సెలెక్టివ్ గా చేస్తూ..

సెలెక్టివ్ గా చేస్తూ..

దగ్గుబాటి రానా మొదటి నుంచి సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు. లీడర్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రానా అప్పుడే హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించడం విశేషం. హీరోగా కొనసాగుతున్న సమయంలోనే భళ్లాలదేవగా విలనిజం పండించి ఆకర్షించాడు. గతేడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ సినిమాలో నటించాడు రానా. ఇందులో కూడా నెగెటివ్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు.

భీమ్లా నాయక్ తర్వాత..

భీమ్లా నాయక్ తర్వాత..

భీమ్లా నాయక్ తర్వాత రానా నుంచి ఒక్క సినిమా రాలేదు. అయితే ఈసారి రానా డిజిటల్ ఎంట్రీ ఇవ్బబోతున్న విషయం తెలిసిందే. రానానే కాకుండా ఫ్యామిలీ హీరో దగ్గుబాటి వెంకటేష్ కూడా ఓటీటీలోకి అడుగుపెట్టారు. వెంకటేష్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. వీళ్లిద్దరు కలిసి డిజిటల్ తెరపైకి ఒకేసారి ఎంట్రీ ఇస్తున్న ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ నిర్మించింది.

క్రైమ్ డ్రామాగా..

క్రైమ్ డ్రామాగా..

అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉన్న రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా నటించారు. ఇటీవల విడుదల చేసిన హిందీ టీజర్ లో జైల్లో చేతులకి సంకెళ్లతో తెల్లగడ్డంతో వెంకీ కొత్తగా కనిపించారు. తండ్రిపై చెప్పలేనంత ద్వేషంతో రగిలిపోయే కొడుకుగా రానా కనిపించాడు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవర్' కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ గా రానుంది. ముకుల్ చద్దా కీలక పాత్ర పోషించగా.. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు.

 సౌత్ సినిమాలంటే అలా..

సౌత్ సినిమాలంటే అలా..

రానా నాయుడు వెబ్ సిరీస్ ను హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. వెంకీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రానా నాయుడు వెబ్ సిరీస్ మార్చి 10న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఇందుకోసం ప్రమోషన్స్ ఎప్పటి నుంచో మొదలు పెట్టగా.. వాటిలో రానా తరచూ పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే బాహుబలి వంటి సౌత్ చిత్రాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలిపాడు. అలాగే కొన్నేళ్ల కిందట సౌత్ సినిమాలంటే నార్త్ లో ఎలా ఉండేదో ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

ప్రభాస్ ఎవరు..

ప్రభాస్ ఎవరు..

"అది బాహుబలి షూటింగ్ జరుగుతున్న రోజులు. నేను ఒక ఫ్రెండ్ ను కలిశాను. నేను బాహుబలి సినిమా తీస్తున్నట్లు చెప్పాను. టైటిల్ రోల్ ఎవరు పోషిస్తున్నారు అని అడిగాడు.. నేను ప్రభాస్ అని చెప్పాను. ప్రభాసా.. ఎవరాయనా.. అని అడిగాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాకా.. ప్రభాస్ చేసిన కొన్ని సినిమా పేర్లు చెప్పాను. వాటిలో అతను ఏ ఒక్క సినిమా చూడలేదు. ఏమో నాకు వాళ్లు ఎవరు తెలియదు. నాకు తెలిసింది ఒక చినూ భర్త మాత్రమే అన్నాడు" అని రానా తెలిపాడు

చినూ భర్త అంటే మహేశ్ బాబు..

చినూ భర్త అంటే మహేశ్ బాబు..


రానా కొనసాగిస్తూ.. "అసలు అతను ఏం చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. నాకు కాసేపు ఆశ్చర్యంలో మునిగిపోయాను. ఆ తర్వాత గుర్తు వచ్చింది. చినూ అంటే నమ్రత శిరోద్కర్. చినూ భర్త అంటే మహేశ్ బాబు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. మహేశ్ బాబు వాళ్లకు అలా తెలుసా. అలా గుర్తుంచుకున్నారా అని. ఒక నాలుగైదేళ్లు ఆగు మా సైన్యం ఇక్కడ దిగుతుంది. అప్పుడు తెలుగు హీరోలు అందరూ తెలుస్తారు అని చెప్పాను" అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X