Virata Parvam: ఆ ఓటీటీలో విరాట పర్వం స్ట్రీమింగ్.. ఎప్పుడు రాబోతుందో తెలుసా!

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎనలేని కష్టం, నష్టం వాటిల్లింది. అలాగే, ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం ఆలస్యం అయిపోయింది. అలాంటి వాటిలో 'విరాట పర్వం' మూవీ ఒకటి. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల తెరకెక్కించాడు. సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను గత వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర నిర్మాతలు భావించారు. కానీ, సెకెండ్ వేవ్ కారణంగా షూటింగ్‌కు బ్రేకులు పడిపోవడంతో దీని విడుదలను వాయిదా వేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే.

రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'విరాట పర్వం' మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పూర్తైన టాకీ పార్ట్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి.. వాటిని కూడా వెంటనే కంప్లీట్ చేసుకున్నారు. ఇలా ఈ సినిమాను విడుదలకు సిద్దం చేశారు. కానీ, ఎందుకనో కొంత ఆలస్యం చేశారు. ఆ సమయంలోనే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు స్పందిస్తూ.. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని వెల్లడించారు.

Rana Daggubati Virata Parvam to Streaming On Netflix from July

'విరాట పర్వం' సినిమాను లాక్‌డౌన్‌కు ముందే విడుదల చేయాలని భావించారు. కానీ, అనివార్య కారణాలతో అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా వదలింది. అంతేకాదు, అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పాటలు, టీజర్, ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. అలాగే, గత ఆదివారమే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. వీటితో పాటు హీరో, హీరోయిన్లు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో ప్రేమకావ్యంగా రాబోతున్న 'విరాట పర్వం' మూవీ సినిమా జూన్ 17న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్, రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందట. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇది థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసే విధంగా ఒప్పందం కూడా అయిపోయిందని తెలిసింది. అంటే ఈ సినిమా జూలై 17 తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ప్యూర్ లవ్‌ స్టోరీతో రాబోతున్న 'విరాట పర్వం' చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల మేలవింపుతో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చాడు. ఇక, ఇందులో రానా కామ్రేడ్ రవన్న గెటప్‌లో ఉండగా.. సాయి పల్లవి మాత్రం పల్లెటూరి అమ్మాయిలా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X