Rana Naidu ఓటీటీలో దుమ్మరేపుతున్న రానా నాయుడు.. నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు!

విక్టరీ వెంకటేష్, టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా దగ్గుబాటి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు రకరకాల వివాదాల మధ్య ఓటీటీలో కొనసాగుతున్నది. అశ్లీలత, అసభ్యత, మితిమీరిన శృంగారం లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌పై సగటు ప్రేక్షకుడు, సినీ క్రిటిక్స్ దారుణంగా విమర్శిస్తున్నారు. మార్చి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. అయితే తెలుగు ప్రేక్షకులు పెదవి విరిచిన రానా నాయుడు ఓటీటీలో రికార్డు వ్యూస్ సాధిస్తున్నది. ఈ వెబ్ సిరీస్ వివరాల్లోకి వెళితే..

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి

రానా నాయుడు వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు. అమెరికాలో పాపులర్ టీవీ సిరీస్ రే డోనోవ్యాన్ ను రానా నాయుడుగా తెరకెక్కించారు. రానా, వెంకటేష్‌తోపాటు సుచిత్రా పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా ఉందనే వాదన తొలి రోజు నుంచి వినిపించింది.

మితిమీరిన శృంగారంతో

మితిమీరిన శృంగారంతో


అయితే మితిమీరిన శృంగార సన్నివేశాలు, బూతులు ఉండటంతో వెంకటేష్, రానా దగ్గుబాటిని దారుణంగా ట్రోల్ చేశారు. క్లీన్ ఇమేజ్ ఉన్న హీరోలు డబ్బు కోసం ఇలాంటి చిత్రాల్లో నటిస్తారా? ఇమేజ్ భిన్నంగా పాత్రలు పోషిస్తారా అని నెటిజన్లు దుయ్యబెట్టారు. దాంతో వెంకటేష్, రానా దగ్గుబాటి మరో కోణంలో చూడవద్దని రిలీజ్‌కు ముందే నెటిజన్లను హెచ్చరించారు.

వెంకటేష్, రానాపై ట్రోలింగ్

వెంకటేష్, రానాపై ట్రోలింగ్


అయితే సోషల్ మీడియాలో రానా నాయుడిపై ట్రోలింగ్ భారీగా జరుగుతున్న నేపథ్యంలో రానా దగ్గుబాటి స్పందించారు. నగ్నం, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించినందుకు గాను.. రానా సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. మా సినిమాపై ప్రేమను కురిపించిన థ్యాంక్స్.. ద్వేషిస్తున్న వారికి క్షమాపణలు అంటూ రానా ట్వీట్ చేశారు.

 రానా నాయుడికి రికార్డు వ్యూస్

రానా నాయుడికి రికార్డు వ్యూస్


ఇదిలా ఉండగా, నెట్‌ఫ్లిక్స్‌లో రానా నాయుడు భారీ రెస్పాన్స్‌ కూడా గట్టుకొంటున్నది. తొలివారంలో రికార్డు వ్యూస్ సాధించిందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. రానా నాయుడు నెట్ ఫ్లిక్స్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. ఈ సినిమా చిత్రం గత వారం రోజుల్లో 8 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించడమే కాకుండా రికార్డు వైపు దూసుకెళ్తున్నది.

రానా నాయుడులో నటీనటులు, సాంకేతిక నిపుణులు

రానా నాయుడులో నటీనటులు, సాంకేతిక నిపుణులు


నటీనటులు: రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్ తదితరులు
బ్యానర్: లోకోమోటివ్ గ్లోబల్
కథ, స్క్రీన్ ప్లే: కరణ్ అన్షుమాన్
దర్శకత్వం : కరణ్ అన్షుమాన్ / సుపర్ణ్ వర్మ
నిర్మాత: సుందర్ ఆరోన్
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-03-10

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X