Rana Naidu Season 2: రానా నాయుడు స్ట్రీమింగ్ డేట్ లాక్.. వెంకీమామ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడంటే?
ఓటీటీ రాకతో సినిమా కంటెంట్ పూర్తిగా మారిపోయింది. ఈ ఓటీటీల కోసం సెపరేట్‌గా వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నారు మేకర్స్. కొన్నిసార్లు ఓటీటీ ప్లాట్‌ఫాంలే స్వయంగా తమకు కావాల్సిన విధంగా వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నాయి. సీనియర్ నటులు, అంతగా సినిమాల్లో గుర్తింపు దక్కనివారు, ఎంతో కాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంస్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు నటన వైపు అడుగులు వేస్తున్నారు. వీరిలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఒకరు.
వెంకీ నోటి వెంట పచ్చి బూతులు
దశాబ్ధాలుగా తన నటనతో ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ మధ్యలో వరుస ఫ్లాపులను ఎదుర్కోవడంతో ఓటీటీలు, వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తన సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు, హీరో రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేశారు. అయితే కెరీర్‌లో ఇప్పటి వరకు క్లీన్ ఇమేజ్‌తో మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరు తెచ్చుకుని ఫ్యామిలీ ఆడియన్స్‌లో సెపరేట్ క్రేజ్ ఉన్న వెంకటేష్ ఈ వెబ్ సిరీస్‌లో బూతులు మాట్లాడటం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. వెంకటేష్ లాంటి స్టార్ ఇలాంటి వెబ్ సిరీస్‌లు అంగీకరించొద్దని అభిమానులు కోరుతున్నారు.

రానా నాయుడుపై తీవ్ర విమర్శలు
రొమాన్స్‌కు తోడు, పచ్చి బూతుల కారణంగా జనం తిరస్కరించడంతో పాటు ఇండస్ట్రీలోని పలువురు పెద్దలు కూడా రానా నాయుడుపై విమర్శలు గుప్పతించారు. అప్పట్లో ఈ వెబ్ సిరీస్ సంచలనం సృష్టించింది. కరణ్ అన్షుమన్- సపర్న్ వర్మల దర్శకత్వంలో వచ్చిన ఈ రానానాయుడులో సుచిత్ర పిళ్లై, రజనీ బసుమతరి, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లాలు కీలకపాత్రలు పోషించారు. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది. 10 ఎపిసోడ్‌లుగా మార్చి 10, 2023న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ రానా నాయుడు స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. విమర్శలు వచ్చినప్పటికీ ఓ సెక్షన్ నుంచి మాత్రం ఈ వెబ్ సిరీస్‌కు ఆదరణ దక్కింది.
రానా నాయుడు 2కి శ్రీకారం
ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ రానా నాయుడు సీజన్ 2కి మేకర్స్ శ్రీకారం చుట్టారు. సీజన్ 1లో వచ్చిన విమర్శల నేపథ్యంలో మేకర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సెకండ్ సీజన్‌లోకి పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా వచ్చి చేరారు. అర్జున్ రాంపాల్, కృతి కర్బంద, డినోమోరియాలు కీలకపాత్రలు పోషించారు. రానా నాయుడు సీజన్ 2కి కరుణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రాలు దర్శకత్వం వహించగా సుందర్ ఆరోన్, లోకోమోటిక్ గ్లోబల్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ నిర్మించాయి. సీజన్ 1లో తండ్రి కొడుకుల మధ్య వైరాన్ని చూపించగా.. సెకండ్ సీజన్‌లో రానా- వెంకటేష్‌ల మధ్య ఫైట్ సీన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రానా నాయుడు 2 స్ట్రీమింగ్ వివరాలు
రానా నాయుడు సీజన్ 2 స్ట్రీమింగ్ ఎప్పుడంటూ గత కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. దీనికి తెరదించుతూ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చింది. జూన్ 13వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రానా నాయుడు 2 స్ట్రీమింగ్ కానుంది. మరి రానానాయుడు సీజన్ 2 .. ఫస్ట్ సీజన్ మాదిరిగా విమర్శలు ఎదుర్కొంటుందా? లేక ఆడియన్స్‌ను మెప్పిస్తుందా? వెంకటేష్ బూతులు తగ్గాయా? పెరిగాయా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











