Rana Naidu Trailer Review హరహర.. వెంకీ నోట బూతుల పురాణం.. రెగ్యులర్ రివేంజ్ డ్రామాగా రానా నాయుడు
టాలీవుడ్ బాబాయ్, అబ్బాయ్ విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు మార్చి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా రానా నాయుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్‌లో రానా, వెంకటేష్ తొలిసారి నటిస్తుండటంతో భారీగా క్రేజ్ కనిపిస్తున్నది. అయితే ఫ్యామిలీ, గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన రానా నాయుడు ట్రైలర్ ఎలా ఉందంటే..

బాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా
రానా నాయుడు వెబ్ సిరీస్‌లో బాలీవుడ్‌లో ఎలాంటి స్కాండల్‌నైనా సులభంగా పరిష్కరించే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. నాగా నాయుడు పాత్రలో వెంకటేష్‌తో కలిసి తండ్రి కొడుకులుగా తెరమీద కూడా కనిపించేందుకు రెడీ అయ్యారు. తండ్రి, కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్, రివేంజ్ డ్రామా అని ట్రైలర్ స్పష్టం చేసింది. బాలీవుడ్ మాఫియాలో అరాచకాలు చేసే పాత్రలో రానా ఫైర్ బ్రాండ్‌గా కనిపించాడు.

నాగా నాయుడి పాత్రలో వెంకీ
నాగా నాయుడుగా వెంకటేష్ నేరానికి శిక్ష అనుభవించి చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చే నేరస్థుడిగా ట్రైలర్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడే ఒకడిని వేసేసి వచ్చాను అంటూ నాగా నాయుడు కామెంట్ చేయడం కనిపించింది. నేను ఏది చేసినా ఫ్యామిలీ కోసమే చేశాను అంటూ నాగా నాయుడు చెప్పడం చూస్తే ఇది ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా కనిపించింది. నాగా నాయుడి ఇద్దరు పిల్లల తల్లి హత్యకు గురైందనే లీడ్‌ను ట్రైలర్‌లో ఇచ్చారు.

తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ
మాఫియా సామ్రాజ్యంలో తండ్రి, కొడుకుల మధ్య అధిపత్యం అనే రెగ్యులర్ డ్రామాగా ట్రైలర్‌లో కనిపించింది. నాగా పాము లాంటి వాడు. ఆయన పగపడితే నీ ఫ్యామిలీని సర్వనాశనం చేసేదాక వదలడు అని రానా చెప్పడం కనిపించింది. అయితే ఎదురుపడిన తండ్రిని చూసి నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే.. నన్ను నాన్న అని పిలువలేవా?. నీ బాప్‌ను నేను అంటూ వెంకీ ప్రశ్నించడం రెండు పాత్రల మధ్య సంఘర్షణ కనిపించింది.

ఓ రేంజ్‌లో వెంకీ బూతుల పంచాగం
రానా నాయుడు ట్రైలర్‌లో నాగాను రానా చంపబోతుంటే.. నీవు పుట్టిన తర్వాత నేను ఐదేండ్లు ముడ్డి కడిగాను. అక్కడ నీకు ఎంత మగతనం ఉంటుందో.. ఎంత చెడు ఉంటుందో నాకు తెలుసు అంటూ వెంకీ చెప్పిన డైలాగ్స్ ట్రైలర్‌లో ఆకట్టుకొన్నాయి. ఇంకా గాండ్ లాంటి మాటలు బాగానే వినిపించాయి. ట్రైలర్‌లోనే ఈ రేంజ్ బూతులు ఉంటే.. సినిమాలో ఏ రేంజ్ బూతులు వెంకటేష్‌తో చెప్పించారో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రెగ్యులర్ రివేంజ్ డ్రామాగా కనిపించిన ఈ వెబ్ సిరీస్.. ఎంత ఆసక్తికరంగా తెరకెక్కించారనే ఆసక్తికరంగా మారింది. అయితే వెబ్ సిరీస్ విషయంలో పెద్దగా బూతులను పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకోవచ్చు. కానీ వెంకీ నోట రావడం కాస్త జీర్ణించుకోవడం కష్టమే.
రానా నాయుడులో నటీనటులు
నటీనటులు: రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్ తదితరులు
బ్యానర్: లోకోమోటివ్ గ్లోబల్
కథ, స్క్రీన్ ప్లే: కరణ్ అన్షుమాన్
దర్శకత్వం : కరణ్ అన్షుమాన్ / సుపర్ణ్ వర్మ
నిర్మాత: సుందర్ ఆరోన్
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-03-10


Click it and Unblock the Notifications











