Don't Miss!
- News
38 ఏళ్ల తర్వాత సియాచిన్లో అదృశ్యమైన సైనికుడి అవశేషాలు లభ్యం
- Sports
పుజారా కేవలం టెస్ట్ ప్లేయరని ఎవరన్నారు..? వన్డేల్లో బౌండరీల వరదతో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన ఘనుడు
- Finance
LIC: పాలసీదారులకు ఎల్ఐసీ సదవకాశం.. ల్యాప్స్ పాలసీ పునరుద్ధరణకు ఛాన్స్.. పెనాల్టీపై డిస్కౌంట్స్..
- Technology
దేశంలో అత్యధికంగా iPhones వినియోగిస్తున్నది ఆ నగరంలోనే!
- Automobiles
"పెద్ద నాన్న" తిరిగొచ్చేశాడు.. ఇంకేం దిగుల్లేదని చెప్పండి..! పాత స్కార్పియో రీ-ఎంట్రీ, వేరియంట్ల వారీగా లభించే
- Lifestyle
Glass Skin: చర్మం అద్దంలా మెరిసిపోవాలా.. ఇలా చేయండి
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
Virata Parvam OTT Release Date: అనుకున్నదాని కంటే ముందే నెట్ ఫ్లిక్స్ లో.. ఎప్పుడంటే?
రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం విరాటపర్వం. నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ పెద్ద సినిమాల విడుదల నేపథ్యంలో అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు జూన్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు సమర్పించారు. ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా సుమారు 15 కోట్ల బడ్జెట్ తో సినిమా రూపొందించారు. కానీ సినిమా విడుదలైన తర్వాత సినిమాకి మంచి మౌత్ టాక్ లభించింది కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం సినిమా యూనిట్ కి నిరాశే ఎదురయింది అని చెప్పాలి.
దానికి తోడు సాయి పల్లవి గో రక్షకులు మీద చేసిన వ్యాఖ్యలతో హిందూ సంఘాల వారు సినిమాని బ్యాన్ చేయండి పిలుపునిచ్చిన నేపథ్యంలో సినిమా కలెక్షన్లు దారుణంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాని అనుకున్న దాని కంటే ముందే అంటే సుమారు 20 రోజుల వ్యవధిలోనే డిజిటల్ వేదికగా విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ వేదికగా జూలై ఒకటో తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ సినిమా యూనిట్. కొత్త సినిమాలు ఎంట్రీ ఇవ్వడంతో థియేటర్లు కూడా కరువైపోయిన నేపథ్యంలో ఇక ఎక్కువ రోజులు ఆపడం కూడా కరెక్ట్ కాదని భావించి సినిమా యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో రానా రవన్న అనే ఒక నక్సలైట్ నాయకుడిగా కనిపించగా అతనితో ప్రేమలో పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన వెన్నెల అనే పాత్రలో సాయిపల్లవి నటించినది. ఈ సినిమాలో నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, ప్రియమణి, జరీనా వాహబ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. పూర్తిస్థాయి తెలంగాణ నక్సలైట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది కానీ ఎందుకో బాక్సాఫీస్ వద్ద మాత్రం నిలబడలేకపోయింది. మరీ దారుణమైన కలెక్షన్లు రావడంతో సినిమా యూనిట్ ఆలోచనలో పడి సినిమా ముందే విడుదల చేయాలని నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాని కేవలం డిజిటల్ వేదికగా విడుదల చేయాలని రానా భావించారు కానీ సినిమా మీద ఉన్న నమ్మకంతో సురేష్ బాబు థియేటర్లలోనే విడుదల చేయాలని భావించి విడుదల చేశారు.