OTT: రానా నాయుడు 2 వచ్చేస్తున్నాడు? ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటే?

By Lekhaka

ఓటీటీలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. మూడు గంటలు థియేటర్ కు వెళ్లి సినిమా చూడడం కంటే ఇంట్లో కూర్చొని ఖాళీ టైంలో సిరీస్ లు చూడ్డానికే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. వెబ్ సిరీస్ లలో అడల్ట్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది. ఆయినా అలాంటి వాటినే ఎక్కువ ఆధరిస్తున్నారు. ఇండియాలో అత్యధిక ప్రేక్షకాధరణ పొందిన వెబ్ సిరీస్ రానా నాయుడు.

తెలుగు ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రానా నటించిన బోల్డ్ యాక్షన్ డ్రామా ఇది. రానానాయుడు సీజన్-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీజన్-2 చిత్రీకరణకు సంబంధించిన వీడియోను యూనిట్ విడుదల చేసింది. దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రానాతో పాటు బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ కూడా వీడియోలో కనపించారు.

Rananaidu season-2 streaming sets in September When it is coming

రీల్ లైఫ్ లో తండ్రీకొడుకులుగా రియల్ లైఫ్ బాబాయి, అబ్బాయి నటించారు. ఫ్యామిలీ హీరోగా పేరున్న దగ్గుబాటి వెంకటేష్ ఇలాంటి సిరీస్ లో నటింటిచడంతో తెలుగు ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అయినా సీజన్-2 చేయడానికి కూడా వెనకాడలేదు వెంకటేష్. సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.

దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం కొన్నాళ్లుగా వీరిద్దరు ముంబయిలోనే ఉండి షూటింగ్ లో పాల్గొంటున్నారు. బోల్డ్ యాక్షన్ కాన్సెప్ట్ తో సీజన్-1 ఇండియాలో మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ గా నిలిచింది. రానానాయుడు సీజన్-2 విడుదల డేట్ పై ఆగస్టులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీజన్-1 నచ్చిన ఆడియన్స్ సీజన్-2 ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

రానా అంటే యువకథానాయకుడు. విభిన్నమైన సినిమాలు చేస్తూ తన కేరీర్ ను నిర్మించుకుంటున్నాడు. ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలో నటించిన కూడా ప్రేక్షకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాదు. కానీ వెంకటేష్ విషయంలో ప్రేక్షకుల ఆలోచనా విధానం వేరేలా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు వరకు ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకకులు ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు.

Rananaidu season-2 streaming sets in September When it is coming

కానీ రానానాయుడుతో ఒక్కసారిగా ఆ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇతర ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నా తెలుసు ప్రేక్షకులు మాత్రం దగ్గుబాటి వెంకటేష్ పట్ల ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అందుకోసం నష్టనివారణ చర్యల్లో భాగంగా రానానాయుడు సీజన్-2లో బోల్డ్ కంటెంట్ ను కాస్త తగ్గించి యాక్షన్, ఎమోషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

సూపర్న్ వర్మ, కరణ్ అన్షమాన్ సంయుక్తంగా రానానాయుడు సీజన్-2ను దర్శకత్వం వహిస్తున్నారు. సీజన్-1లో వెంకటేష్, రానాతోపాటు సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, సుచిత్రా పిళ్లై, సుర్వీన్ చావ్లా కీలక పాత్రల్లో నటించారు. సీజన్-2లో వీరితోపాటు బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన నటీనటులు మరికొన్ని కొత్త క్యారెక్టర్స్ లో కనిపించున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X